YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐదోసారి గెలుపు కోసం.... కొడాలి నాని ప్రయత్నాలు

ఐదోసారి గెలుపు కోసం.... కొడాలి నాని ప్రయత్నాలు

విజయవాడ, ఏప్రిల్ 1 
క్రిష్ణా జిల్లా మచిలీపట్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గుడివాడ అసెంబ్లీ ఎంతో కీలకమైన నియోజకవర్గం. తెలుగువాడి కీర్తి ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన నియోజకవ‌ర్గం. కమ్యూనిస్టుల ఖాతాలో ఉన్న ఈ నియోజకవర్గంపై తొలుత కాంగ్రెస్ పాగా వేయగా...తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. గత రెండు దఫాలుగా వైసీపీ గెలుస్తూ వస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు ఎదురుచూస్తున్న మరో ఫలితం గుడివాడ. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి వెళ్లి వైసీపీలో చేరిన కొడాలి నాని వరుసగా రెండుసార్లు గెలిచారు. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగే...కొడాలినానిని ఈసారి గుడివాడలో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం నాలుగేళ్ల క్రితమే ప్రణాళికలు రచించింది...గెలుపు గుర్రాన్ని సిద్ధం చేసింది. అసలు నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇక్కడ ఎవరెవరు గెలిచారో ఒకసారి చూద్దాం..1952లో ఏర్పడిన గుడివాడ నియోజకవర్గంలో తొలుత కమ్యునిస్టుల ప్రభావం ఉండేది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై సీపీఐ అభ్యర్థి గుంజి రామారావు విజయం సాధించారు. ఏడాదికే జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఐ నుంచి కాట్రగడ్డ రాజగోపాల్రావు గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుచి వేముల కూర్మయ్య విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో మరోసారి సీపీఐ నుంచి గుంజి రామారావు జయకేతనం ఎగురవేశారు. 1967లోజరిగిన ఎన్నికల్లో ఎం.కె. దేవి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి వెంకట సుబ్బారావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కఠారి సత్యనారాయణరావు విజయం సాధించారు. 1978లోనూ మళ్లీ వీరివురు పోటీపడగా...మళ్లీ కఠారినే గెలుపొందారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత తన సొంత నియోజకవర్గామైన గుడివాడ నుంచి నందమూరి తారకరామారావు భారీ మెజార్టీతో విజయం సాధించారు.1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గుడివాడ నుంచి మరోసారి ఎన్టీఆర్ పోటీ చేయగా...ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పలపాటి సూర్యనారాయణబాబు నిల్చున్నారు. రెండోసారి గుడివాడ నుంచి ఎన్టీఆర్ విజయం సాధిచారు. ఎన్టీఆరో రెండుచోట్ల నుంచి విజయం సాధించడంతో గుడివాడలో రాజీనామా చేయగా...రావిశోభనాద్రి చౌదరి తెలుగుదేశం నుంచి గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి రావి శోభనాద్రిచౌదరిపై కాంగ్రెస్ అభ్యర్థి కఠారి ఈశ్వర్‌కుమార్ కేవలం 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.1994లో జరిగిన ఎన్నికల్లో మరోసారి వీరిద్దరే పోటీపడగా..ఈసారి తెలుగుదేశం అభ్యర్థి రావి శోభనాద్రి చౌదరి గెలుపొందారు.1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి రావి హరిగోపాల్ పోటీచేయగా...కాంగ్రెస్ నుంచి శేగు వెంకటేశ్వర్లుపోటీలో నిల్చున్నారు. మరోసారి తెలుగుదేశాన్ని విజయం వరించింది. రోడ్డు ప్రమాదంలో హరిగోపాల్ మృతిచెందగా ఉపఎన్నికల్లో ఆయన సోదరుడు రావి వెంకటేశ్వరరావు( విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి కొడాలి నాని కాంగ్రెస్ నుంచి కఠారి ఈశ్వర్‌కుమార్ పోటీ చేయగా...నాని విజయం సాధించారు.2009లోనూ గుడివాడ నుంచి తెలుగుదేశం  అభ్యర్థిగా కొడాలి నాని కాంగ్రెస్ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. ఆ తర్వాత కొడాలి నాని వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రావివెంకటేశ్వర్రావుపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరఫున కొడాలినాని పోటీ చేయగా...తెలుగుదేశం నుంచి దేవినేని అవినాష్(పోటీపడ్డారు. వరసగా నాల్గవసారి కొడాలి నాని గెలుపొందారు. జగన్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ తరపున పోటీకి సిద్ధం కాగా...తెలుగుదేశం పార్టీ ఎన్నారై  వెనిగండ్ల రాముకు టిక్కెట్ ఇచ్చింది. ఈసారి గుడివాడలో పోటీ నువ్వా-నేనా అన్నట్లు ఉంది.

Related Posts