YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలతో 16న బీసీసీఐ కీలక సమావేశం..

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలతో 16న బీసీసీఐ కీలక సమావేశం..

న్యూ డిల్లీ ఏప్రిల్ 1
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) 2024 సీజన్‌ మొదలవగా.. ఇప్పటి వరకు 13 మ్యాచులు ముగిశాయి. టోర్నీలో పాల్గొన్న పది ఫ్రాంచైజీల యాజమానులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం ఈ నెల 16న అహ్మదాబాద్‌లో జరుగనున్నది. అదే రోజు నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ – గుజరాత్‌ టైటన్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగనున్నది. ఈ సమావేశానికి ఐపీఎల్‌ జట్ల యజమానులతో పాటు సీఈఓలు, ఆపరేషనల్ బృందాలను సైతం సమావేశానికి పిలిచే అవకాశం ఉందని సమాచారం.కీలక సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ సైతం హాజరవనున్నారు. సమావేశానికి ఐపీఎల్ సీఈవో హేమాంగ్ అమిన్ ఆహ్వానం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. మెగా వేలానికి ముందే పా సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, ఫ్రాంచైజీలకు పంపిన ఆహ్వానంలో ఎజెండాను మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. హఠాత్తుగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. వచ్చే ఏడాది జరుగనున్న మెగా వేలం జరుగనున్నది. ఇందుకు సంబంధించి బీసీసీఐ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.ఐపీఎల్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై సైతం చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వేలానికి ముందు ఆటగాళ్ల రిటైన్‌పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రిటైన్‌ విషయంలో జట్ల యాజమాన్యాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. రిటైన్‌ చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్యపై ఏకాభిప్రాయం లేదు. ప్రస్తుతం ఈ విషయంలో వేలానికి ఓ ముందే నిర్ణయానికి రావాలని బీసీసీఐ భావిస్తున్నది. కొన్ని ఫ్రాంచైజీలు రిటైన్‌ ఆటగాళ్ల సంఖ్యను ఎనిమిదికి పెంచాలని కోరుతున్నారు. కొన్ని ఫ్రాంచైజీలు ఈ సంఖ్యను ఎనిమిదికి పెంచాలని కోరుతున్నాయి. అయితే, మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అలాగే దాంతో పాటు సాలరీ క్యాప్‌పై చర్చించే అవకాశాలున్నాయి. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.100 కోట్లు పరిమితి కాగా.. ఈ సారి పెరుగుతుందని భావిస్తున్నారు.

Related Posts