YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వలంటీర్ల రాజీనామాల వెనుక...

వలంటీర్ల రాజీనామాల వెనుక...

విజయవాడ, ఏప్రిల్ 2
ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.   ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నిక‌లు ద‌గ్గర‌ప‌డుతున్న కొద్దీ రోజుకో వ్యవ‌హారం అధికార‌, ప్రతిప‌క్షాల మ‌ధ్య వివాదానికి దారి తీస్తోంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ వేదిక‌గా వైసీపీ, టీడీపీ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, ప్రత్యారోప‌ణ‌లు చేసుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కు ఓట‌ర్ల జాబితాలో అక్రమాలు జ‌రిగాయ‌ని రెండు పార్టీలు విమ‌ర్శలు చేసుకున్నాయి. త‌మ పార్టీ సానుభూతిప‌రుల ఓట్లు తొల‌గించేస్తున్నారంటూ రెండు పార్టీలు విమ‌ర్శలు చేసుకున్నాయి. ఆ త‌ర్వాత వాలంటీర్ల వ్యవ‌హారంపై వ‌రుస‌గా ఎన్నిక‌ల క‌మిష‌న్‎కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేస్తూ వ‌స్తోంది. తాజాగా మ‌రోసారి వ‌లంటీర్ల వ్యవ‌హారంపై కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ వ‌ర్సెస్ ప్రతిప‌క్షాలు అన్నట్లు మారిపోయింది. వృద్దుల‌ను ఇబ్బంది పెట్టేలా టీడీపీ చ‌ర్యలంటున్న వైసీపీ.. కాదు, డ‌బ్బులు లేనందునే మాపై ఆరోప‌ణ‌లు అంటోంది టీడీపీ. పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాజ‌కీయ దుమారాన్ని రేపాయి. టీడీపీ-బీజేపీల బినామీ సంస్థతో ఈసీకి ఫిర్యాదు చేయించ‌డంతోనే అంతా జ‌రిగింద‌నేది వైసీపీ వాద‌న‌. ఎప్పటి మాదిరిగానే పెన్షన్లు పంపిణీ జ‌రిగేలా చ‌ర్యలు చేప‌ట్టాలంటూ ప్రతిప‌క్షాల విమ‌ర్శల‌తో ఎన్నిక‌ల ముందు కాక‌మ‌రింత పెరిగింది. వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. వారికి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు, ఫోన్లను  ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.  రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇక నేరుగా వైసీపీ తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజీనామా చేసినందున వారి కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. వారిని పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టాలన్న ఆలోచనతో వైసీపీ నేతలు ఉన్నారు.  వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 ఇళ్లను ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నియమించారు. వారు సంక్షేమ పథకాలను లబ్ధిదారులను నేరుగా ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. వాలంటీర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కొన్ని ప్రాంతాల్లో విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించొద్దని పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఏప్రిల్ 1 నుంచి మూడు రోజుల పాటు పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వారి సేవలు నిలిపివేయాలని సూచించింద వాలంటీర్లు ఉద్యోగులు కారు. వారు గౌరవ వేతనానికి పనిచేస్తున్నారు. ఈ కారణంగా సర్వీస్ రూల్స్ వర్తించవు. అయితే ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందున రాజకీయ పార్టీలకు నేరుగా  పని  చేయలేరు. రాజీనామాలు చేస్తే ఎవరికైనా పని చేసుకోవచ్చ. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను.. మళ్లీ వాలంటీర్లుగా నియమించుకునే అవకాశంం ఉంది. కానీ ప్రభుత్వం మారితే రాజీనామా చే్సిన వారిని మళ్లీ తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు నేరుగా  వైసీపీకి పని చేసి ఉన్నారు కాబట్టి.. ప్రభు్తవం మారితే తీసుకోరు. రాజీనామాలు చేయకుండా.. వైసీపీకి పని చేయకుండా ఉన్న వాలంటర్లను మాత్రం కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వరుసగా హామీ ఇస్తూ వస్తున్నారు. వాలంటీర్లకు యాభైవేల వరకూ ఆదాయం వచ్చేలా చూస్తానని చెబుతున్నారు. వైసీపీ చెప్పినట్లుగా  చేయకుండా.. నీతిగా.. నిజాయితీగా విధులు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు రావంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది వాలంటీర్లు తటస్థంగా ఉన్నప్పటికీ మెజారిటీ వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. ప్రభుత్వం మారితే వీరెవరికి మళ్లీ అవకాశం వచ్చే  చాన్స్ లే్దు.

Related Posts