YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన అభ్యర్ధి... వయా టీడీపీ

జనసేన అభ్యర్ధి... వయా టీడీపీ

విజయవాడ, ఏప్రిల్ 2,
జనసేన పెండింగ్ అసెంబ్లీ స్థానాల్లో అవనిగడ్డ ఒకటి. ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు పవన్ అభ్యర్థులను ప్రకటించారు. రెండు పార్లమెంట్ స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేశారు.కేవలం అవనిగడ్డతో పాటు పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది.అయితే ఇందులో పాలకొండ నుంచి ఆరుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు.ఐ విఆర్ఎస్ సర్వే చేసి అభ్యర్థిని డిసైడ్ చేయనున్నారు.మరోవైపు అవనిగడ్డ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.అక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు.వారిపై సర్వే నిర్వహించగా ప్రతికూల ఫలితాలు రావడంతో పవన్ పునరాలోచనలో పడ్డారు. అక్కడ టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే మండలి బుడ్డ ప్రసాద్ ను జనసేనలోకి తెచ్చి టికెట్ ఇవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.అవనిగడ్డ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా రకాల వ్యూహాలను తెరపైకి తెచ్చారు. ఇక్కడ మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరిని పోటీ చేయించాలని చూసినట్లు తెలుస్తోంది. బాలశౌరి స్థానంలోఎంపీ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను ప్రకటించాలని చూసినట్లు సమాచారం.అయితే అందుకు బాలశౌరి ఒప్పుకోలేదని తెలుస్తోంది.తాను ఎంపీగా పోటీ చేస్తానని.. ఎమ్మెల్యేగా చేయనని బాలశౌరి పవన్ కు స్పష్టత ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అదే సమయంలో అవనిగడ్డ సీటును వంగవీటి రాధాకృష్ణకు ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లు సమాచారం.స్థానిక జనసేన నేతలు ముగ్గురిని పరిగణలోకి తీసుకుని నిర్వహించిన సర్వేలో సానుకూలత రాలేదని తెలుస్తోంది. అందుకే మండలి బుద్ధ ప్రసాద్ తో పవన్ చర్చించారని, ఆయన జనసేనలోకి వచ్చేందుకు సమ్మతించారని, ఈరోజు పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో మండలి బుద్ధ ప్రసాద్ చేరతారని ప్రచారం జరుగుతోంది.మండలి బుద్ధ ప్రసాద్ సీనియర్ నాయకుడు. అవనిగడ్డ నియోజకవర్గం లో మంచి పట్టు ఉంది. 1999 ఎన్నికల్లో గెలిచారు. 2004 ఎన్నికల్లో రెండోసారి బరిలో నిలిచి విజయం సాధించారు.2014 ఎన్నికల్లో మరోసారి గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అయితే ఇక్కడ జనసేనకు సరైన క్యాడర్, సరైన అభ్యర్థి లేకపోవడంతో సర్వే ఫలితాలు ఆధారంగా మండలి బుద్ధ ప్రసాద్ వైపే పవన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరడం ఖాయంగా తేలుతోంది. ఒక్కరోజు అటు ఇటు అయినా ఆయనే జనసేన అభ్యర్థి అవుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.అభ్యర్థులే లేనట్టు టీడీపీ నేతను జనసేనలోకి చేర్చుకొని ఇవ్వడం అనేది దారుణం.

Related Posts