YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫార్మర్ పాలిటిక్స్...

ఫార్మర్ పాలిటిక్స్...

కరీంనగర్, ఏప్రిల్ 2
పార్లమెంటు ఎన్నికల ముందు.. తెలంగాణలో ఫార్మర్‌ పాలిటిక్స్‌కు అన్ని పార్టీలు తెరలేపాయి. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లు గెలవాలని అధికార కాంగ్రెస్‌ భావిస్తోంది. సర్వే సంస్థలు కూడా ఈమేరకు అంచనా వేశాయి. అయితే సీఎం రేవంత్‌ మాత్రం 14 స్థానాలు మావే అంటున్నారు. ఈ తరుణంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఫార్మర్‌ పాలిటిక్స్‌కు తెర తీశాయి. తెలంగాణలో ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి. జలాశయాలు అండుగంటుతున్నాయి. తాగునీరు కూడా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఈ అంశాలతోనే కేసీఆర్‌ రాజకీయం మొదలు పెట్టారు.కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడంతో దీనిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని కేసీఆర్‌ భావించారు. కానీ, కాళేశ్వరం కుంగిపోవడం, దక్షిణ తెలంగాణను పట్టించుకోకపోవడం అంశాలతో కేసీఆర్‌ ఆశించిన ఫలితం రాలేదు. అది కాంగ్రెస్‌కే ప్లస్‌ అయింది. బీఆర్‌ఎస్‌ ఫెయిల్‌ అయింది. దీంతో కేసీఆర్‌ ఒకే సభ పెట్టి సైలెంట్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు చావో రేవో అన్నట్లుగా మారాయి. ఒక్క సీటుఅయినా గెలుస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ మళ్లీ ఫాంహౌస్‌ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ నుంచి సీనియర్‌ నాయకులు కేకే, కడియం లాంటి వాళ్లు కూడా పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపేందుకు కేసీఆర్‌ బయటకు వచ్చారు.బయటకు రావడానికి కేసీఆర్‌ ఫార్మర్‌ ఫార్ములాను ఎత్తుకున్నారు. దానిని అమలు చేయడంలో భాగంగా రైతు పరామర్శ యాత్ర మొదలు పెట్టారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో పర్యటించారు. వారం తర్వాత కరీంనగర్‌లో పర్యటించాలని భావిస్తున్నారు. అక్కడ కూడా రైతులను పరామర్శించేల ప్లాన్‌ రెడీ చేసుకున్నారు.ఈ తరుణంలో కరీంనగర్‌ సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ అలర్ట్‌ అయ్యారు. కేసీఆర్‌ రైతుల అజెండాతో కరీంనగర్‌కు వస్తే తాను వెనుకబడి పోతానని భావించిన బండి కూడా అదే రైతు ఎజెండాతో దీక్షకు దిగాలని నిర్ణయించారు. ఈమేరకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కలెక్టరేట్‌ ఎదుట దీక్షకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తన ఇంటి వద్దనే దీక్షకు సిద్ధమవుతున్నారు.బీఆర్‌ఎస్, బీజేపీలు రైతుల పేరుతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్‌ సైలెంట్‌గా ఉండటంపై ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ వాగ్ధాటికి, బండి సంజయ్‌ అటాకింగ్‌కు తగ్గట్లుగా కాంగ్రెస్‌ నుంచి కౌంటర్‌ పడలేదు. ఇదే కొనసాగితే కాంగ్రెస్‌ సైడ్‌ అవడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రైతులకు గుడ్ న్యూస్
 కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హామీలను నెరవేర్చే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తోంది కూడా. ఇప్పటికే చాలా మంది ఈ గ్యారెంటీ పథకాల్లో లబ్ది పొందారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అర్హులైన రైతులకు మాత్రమే రైతుబంధు నిధులను మంజూరు చేసింది ఈ ప్రభుత్వం.ఏ భూమికి రైతు బంధు నిధులు వస్తున్నాయో.. ఆ భూమిని కచ్చితంగా సాగు చేయాలి అని తెలిపింది ప్రభుత్వం. కేవలం 5 ఎకరాల భూమి ఉన్నవారికి మాత్రమే ఈ నిధులు వస్తున్నాయి. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు మంజూరు చేయలేదట ప్రభుత్వం. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారుమరోవైపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా రైతుబంధు నిధులు విడుదల చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతుబంధు కీలక కామెంట్లు చేశారు. రైతు బంధు నిధులు ఇవ్వలేదని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. అంతేకాదు 64 లక్షల 75 వేల మంది రైతులకు రూ. 5,575 కోట్ల పెట్టుబడి సాయం కూడా అందించామని తెలిపారు.92 శాతం రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బు జమ చేశామని తేల్చి చెప్పారు. మిగిలిన వారందరూ కూడా ఎక్కవు భూమి ఉన్నవారిని.. అందులో కూడా అర్హులైన వారికి నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. కానీ వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఏకంగా రైతు భరోసా కింద చెప్పినట్టు రూ. 15 వేలు జమచేస్తామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయబోతున్నట్టు సమాచారం

Related Posts