YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెన్షన్లు పంచాలంటే పంచాయతీ అధికారులు లేరా..

పెన్షన్లు పంచాలంటే పంచాయతీ అధికారులు లేరా..

బద్వేలు
బద్వేలు నియోజవర్గం బి. కోడూరు మండలంలో 10 గ్రామపంచాయతీలో దాదాపు 46గ్రామాలు  ఉన్నాయి. 110 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పటికీ 1వ తారీకు  ప్రతి ఇంటికి వెళ్లి గంటలోపు పెన్షన్ పంపిణీ చేయవచ్చని టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి సూచించారు. వాలంటీర్లు పెన్షన్లు పంచకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ లేకపోతే ప్రతి ఇంటికి వెళ్లి 110 అధికారులు ఉంటే ఎందుకు పెన్షన్ పంపిణీ చేయలేకపోతున్నారన్నారు . కానీ ప్రజల ఆలోచనలు మార్చాలని చూస్తే నమ్మే పరిస్థితిలో ఎవరు లేరన్నారు. ఇంతవరకు పెన్షన్ పంపిణీ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులను వితంతువులను వికలాంగులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని రామచంద్రారెడ్డి హితవు పలికారు.

Related Posts