భారత స్టార్ క్రికెటర్ రాహుల్ , బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ డేటింగ్ లో ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విష్యం ఫై నిధి అగర్వాల్ స్పందించారు. ‘ఔను..నేను, రాహుల్ కలిసి డిన్నర్‌కు వెళ్లింది నిజమే. గతంలోనూ చాలా సార్లు వెళ్లాం. ఎన్నో ఏళ్ల నుంచి మేమిద్దరం ఒకరికొకరం తెలుసు. రాహుల్ క్రికెటర్ అవ్వకముందు, నేను నటిని కాకముందు నుంచి మా ఇద్దరికీ పరిచయం ఉంది. అలా అని మేమిద్దరం బెంగళూరులో కలిసి చదువుకున్నాం అనుకునేరు!. అలాంటిదేమీ లేదు. ఎప్పట్నుంచో పరిచయం ఉంది అంతే’ అని నిధి వివరించింది.