YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అసంతృప్తులను ఏకం చేస్తున్న బీజేపీ

అసంతృప్తులను ఏకం చేస్తున్న బీజేపీ

హైదరాబాద్, ఏప్రిల్ 4,
తెలంగాణ బిజెపి అసంతృప్తులను యాక్టివ్ చేస్తుందా? ఏ నియోజకవర్గంలో అసంతృప్తి లేకుండా చేసుకునే ప్రయత్నం చేస్తుందా? నేతల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి గెలుపే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తుందా? జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఎలాంటి డైరెక్షన్ ఇచ్చింది? పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ ఎలాంటి వ్యూహాలను అవలంబిస్తున్నారు? ఇంతకీ పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది?
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడానికి బిజెపి మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థులపై వ్యూహాలు రచించడమే కాదు.. సొంత పార్టీ  నేతల మధ్య  సమన్వయం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని కాషాయ పార్టీ పనిచేస్తుంది. కీలకమైన నేతలు ఎవరు కూడా అసంతృప్తిగా ఉండకుండా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారో పార్టీ ఎన్నికల ఇంచార్జ్ ఆరా తీస్తున్నారు. ఎవరైతే యాక్టివ్ గా లేరో ఆ నేతలను యాక్టివ్ చేయడానికి నేరుగా పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగుతున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ నివాసానికి వెళ్లిన అభయ్ పాటిల్..... హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో యాక్టివ్ గా పనిచేయాలని కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు రాజాసింగ్ ప్రచారంలో కూడా పాల్గొనలేదు. అసలు ప్రచారనికి ఎందుకు రావడం లేదు... మీకు ఎలాంటి సమస్యలున్నాయి? ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? అనే అంశాలను రాజసింగ్ వద్ద ఎన్నికల ఇంచార్జ్ అభయ్ పాటిల్ అరా తీసినట్లు సమాచారం. అయితే పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయం కనీసం తనను సంప్రదించలేదని రాజసింగ్ రాష్ట్ర నాయకత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఎన్నికల ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అయితే రాజసింగ్ వ్యక్తం చేసిన సమస్యలన్నిటిని కూడా జాతీయ నాయకత్వం  దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఇక రానున్న పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటుతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పాటిల్....రాజా సింగ్ సూచించారు. దీంతో ఇకనుండి యాక్టివ్ గా పనిచేస్తానని రాజసింగ్ కూడా ఎన్నికల ఇన్చార్జికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
వాయిస్
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని గుర్తించిన పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్..... ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి విభేదాలు ఉండకుండా ఓట్ బ్యాంకు బిజెపికి అనుకూలంగా మల్చుకునే విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో కూడా సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికలను జాతీయ నాయకత్వం తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తరుణంలో ప్రతి నియోజకవర్గంలో కష్టపడి పని చేయాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు అభయ్ పాటిల్ దిశా నిర్దేశం చేసినట్లు తెలస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల దగ్గర కూడా పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు ఉన్నాయని ఆరా తీసినట్లు పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. విభేదాలను అన్నిటిని పక్కకు పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని నేతలందరికీ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన తర్వాత రాష్ట్రానికి వచ్చిన అభయ్ పాటిల్ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పొరపాట్ల వల్ల ఓడిపోయామని గ్రహించిన ఇంచార్జ్.. అలాంటి పొరపాట్లకు పార్లమెంట్ ఎన్నికల్లో తావు లేకుండా ప్రయత్నం చేస్తున్నారు.
ఎండ్ వాయిస్
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేరు అన్నట్టుగా ... సొంత పార్టీలో అసంతృప్తులు ఉంటే ఎన్నికల్లో గెలవడం కూడా కష్టమని భావించి ఎక్కడికి అక్కడ బుజ్జగింపులకు ఇంచార్జీ తెరలేపారు. మరి పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి నేతలందరూ అంతర్గత విభేదలను విడిచి ఏకతాటి పైకి వస్తారా... జాతీయ నాయకత్వం ఆశించిన విధంగా మెజార్టీ స్థానాలు సాధిస్తారా ..వేచి చూడవలసిందే.

Related Posts