YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పొలింగ్ శాతాన్ని పెంచాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పొలింగ్ శాతాన్ని పెంచాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్
అంబర్పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్ పర్యటన లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ మే 13వ తేదీన తెలంగాణలో లోక్ సభలో ఎన్నికలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోందని కేంద్రమంత్రి కి,న్ రెడ్డి అన్నారు.  తెలంగాణ లో నాలుగో విడతలో మే 13న ఎన్నికలు ఉంటాయని, జూన్ 4న ఫలితాల రానున్నాయి అన్ని రకాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రధానమంత్రి ఎంపీ ఎన్నికల ప్రచార ఐదు సభల్లో పాల్గొన్నారని తెలిపారు. అభ్యర్థులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. అందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఓటు అనేది మన హక్కు ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత అని అన్నారు.
 హైదరాబాద్ నగరంలో ఎప్పుడు 40 శాతానికి మించి ఓటింగ్ శాతం ఉండదు దానిపై మనం దృష్టి సారించాలి  ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి  వ్యక్తిగతంగా సంఘంగా ఏర్పడి ఓటు వేసే ఉద్యమాన్ని నడపాలని  మనమంతా పోలింగ్ పర్సంటేజీని పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి అందరూ పోలింగ్ లో పాల్గొనాలని అన్నారు. ఈసారి దేశం, భవిష్యత్తు కోసం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.  దేశాభివృద్ధి కోసం ఓటు వేయాలని అన్నారు. దీంతో మన భవిష్యత్తు కూడా బాగుపడుతుందన్నారు.  2014కు ముందు 50 సంవత్సరాలు దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింది మోడీకి ముందు మోది తర్వాత దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి మీరే స్వయంగా తెలుసుకోండి. అవినీతి రహిత పరిపాలన అందించిన మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది , శాంతిభద్రతలు దేశ భద్రతను దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేసారు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట  వేసారు.
మతకలహలు కర్ఫ్యూలు లేని పాలన అందించారు ఉగ్రవాదాన్ని పెకిలించి బాంబు పేలుళ్లకు అడ్డుకట్ట వేసింది బీజేపీ ప్రభుత్వం.  అంతర్గత భద్రత విషయంలో మోడీ ప్రభుత్వం పనిచేసిన తీరును ఒక్కసారి మీరే పరిశీలించండి ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి ఆలోచించి దేశ ప్రధాని ఎన్నుకోండి అని పిలుపునిచ్చారు

Related Posts