YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిశ్రమలు రాలేదు గంటా శ్రీనివాసరావు

రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిశ్రమలు రాలేదు గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం
భీమిలి నియోజకవర్గం లో టీడీపీ కి కొత్త సువర్ణ అద్యయనం వచ్చిందని కూటమి అభ్యర్ది గంటా శ్రీనివాసరావు అన్నారు.
మరలా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని ప్రజలు అందరూ ఎదురు చూస్తున్న సమయం. ఉమ్మడి కూటమి ఏర్పాటు అయ్యాయి. భీమిలి కూటమి అభ్యర్థి గా నన్ను అనౌన్స్ చేసిన తర్వాత ఆనంద పురం,పద్మ నాభం, భీమిలి మండలాలు నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఆనంద పురం నాకు కలిసి వచ్చే మండలం. ముగ్గురు సర్పంచ్ లు, వార్డు సభ్యులు, సుమారు 200 మంది జాయిన్ అయ్యారు. భవిష్యత్తులో మరిన్ని జాయినీంగ్ లు వుంటాయి. అందరి కీ సాదర స్వాగతం పలుకుతున్నానని అన్నారు.
ఈ రోజు నుండి మా టీడీపీ కుటుంబంలో మీరంతా సభ్యులు. భవిష్యత్తులో గెలుపు కు అందరూ కలిసి కట్టుగా కృషి చేయండి. 2019 లో జగన్ మోహన్ రెడ్డి ఒక చాన్స్ అడిగితే ఆ మాయలో పడి పోయారు. రాష్ట్రంలో 151 స్థానాలు ఇచ్చారు... ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజా వేదిక కూల్చివేత జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిశ్రమలు రాలేదు. సంక్షేమం కావాలి... సంక్షేమం కి నాంది పలికింది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్. సంపద సృష్టించ కుండా సంక్షేమం అమలు చేయడం కరెక్ట్ కాదు.. ప్రజలు హర్షించరు. హైదరాబాద్ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి, అనంతపురం లో కియా మోటార్ వంటి పరిశ్రమ వచ్చింది. పాలన అనేది అలా చేయాలి. మంచి చేశాను అని నమ్మి తేనే ఓటు వేయమని చెప్పే జగన్ మోహన్ రెడ్డి...900 హామీ లు ఇచ్చారు. ఏమేమి అమలు చేయలేదో శ్వేత పత్రం విడుదల చేశాం. 85 శాతం అమలు చేయలేదని అన్నారు.

Related Posts