YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ రెండు నియోజకవర్గాలు హాట్ గురు

 ఆ రెండు నియోజకవర్గాలు హాట్ గురు

గుంటూరు, ఏప్రిల్  5 
ఈసారి ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలు కీలకం. ఈ రెండు నియోజకవర్గాలు కొన్ని విషయాల్లో ప్రత్యేకత సంతరించుకున్నాయి. విజయవాడ తూర్పు లో 1983 నుంచి ఏ పార్టీ గెలిచినా.. ముస్లిం అభ్యర్థి గెలుపొందుతూ వస్తున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి.. రాష్ట్రంలోనే ఇద్దరు మహిళా నేతలు ముఖాముఖిగా పోటీకి దిగుతున్న ఏకైక నియోజకవర్గంగా నిలిచింది.దీంతో అందరి దృష్టి ఈ రెండు నియోజకవర్గాల పైనే ఉంది.గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలోని గుంటూరు ఈస్ట్ జనరల్ నియోజకవర్గం. అయినా సరే ఇక్కడ ముస్లింలదే పెత్తనం. పార్టీ ఏదైనా ఇక్కడ ముస్లిం అభ్యర్థి గెలవడం గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. గుంటూరు సిటీ తో పాటు రూరల్ మండలంలో కొంత భాగం ఈ నియోజకవర్గంలో ఉంది. 2,29,830 మంది ఓటర్లు ఉన్నారు. జనాభాలో ముస్లింలది అగ్ర భాగం. కమ్మ, వైశ్యతో పాటు ఇతర వర్గాలు కూడా ఉన్నాయి. టిడిపి ఆవిర్భావం తర్వాత తొమ్మిది ఎన్నికలు జరిగాయి. అందులో నాలుగు సార్లు కాంగ్రెస్, మూడుసార్లు టిడిపి, రెండుసార్లు వైసీపీ గెలిచింది.2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ మస్తాన్ వలి.. పిఆర్పి అభ్యర్థి షేక్ షేక్ పై గెలుపొందారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన లాల్ జాన్ బాషా సోదరుడు జియావుద్దీన్ మూడో స్థానంలో నిలిచారు.2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ ముస్తఫా టిడిపి అభ్యర్థి మద్దాలి గిరి పై విజయం సాధించారు. 2019లో సైతం షేక్ ముస్తఫా భారీ విజయం సాధించారు. టిడిపి అభ్యర్థిపై 22 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ముస్తఫా కుమార్తె నూర్ ఫాతిమా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.1983 నుంచి 9 ఎన్నికలు జరగగా.. అన్ని ఎన్నికల్లోను ముస్లిం అభ్యర్థులే భారీ విజయం సాధించడం విశేషం.గుంటూరు వెస్ట్ కి సంబంధించి ఇద్దరు మహిళ నేతలు ముఖాముఖిగా పోటీకి దిగుతున్నారు. మరి ఏ ఇతర నియోజకవర్గాల్లో మహిళా నేతలు ముఖాముఖిగా పోటీ పడడం లేదు. దీంతో ఈ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా.. టిడిపి అభ్యర్థిగా మాధవి బరిలో దిగారు. ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. భర్తలు మాత్రం వేరే సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు మహిళా నేతలు పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గం పై ఉంది. మొత్తానికైతే గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

Related Posts