YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హంతకులను కాపాడుతున్న జగన్ షర్మిల

హంతకులను కాపాడుతున్న జగన్ షర్మిల

కడప
కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గం అమగంపల్లి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి శుక్రవారం  ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ  వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి.  ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతాలు చేశారు.  ఇప్పుడు జగన్  ముఖ్యమంత్రిగా ఉన్నారు.  జగన్ బీజేపీ కి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.  విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు.  ప్రత్యేక హోదా లేదు,కడప స్టీల్ లేదు.  ఇవ్వాళ వైఎస్సార్ బిడ్డ కడప ఎంపిగా చేస్తుంది.  దీనికి కారణం జగన్. బాబాయి నీ చంపిన హంతుడుకి మళ్ళీ సీట్ ఇచ్చారు.   హంతకులను కాపాడుతున్నారు.  ఇది దురదృష్టం,దుర్మార్గం.  ఇది అన్యాయం.  హంతుకులు మళ్ళీ చట్ట సభలోకి వెళ్ళకూడదు.  న్యాయం ఒక వైపు,అధికారం ఒక వైపు.  అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా ? న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల కావాలా ?  ప్రజలు నిర్ణయం తీసుకోవాలి.  హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని,కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరినీ ఒడించాలి.  రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలి.  కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం అభివృద్ది. కడప స్టీల్ ఫ్యాక్టరీ నీ శంకుస్థాపన ల ప్రాజెక్ట్ చేశారు.  జగన్  రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాక శంకుస్థాపన చేశారు తప్పితే ఉపయోగం లేదు.  బీజేపీ దగ్గర జగన్ ఒక బానిస లా మారారు.  బద్వేల్ నుంచి విజయజ్యోతి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారి అన్నారు.
వైఎస్ సునీతా రెడ్డి మాట్లాడుతూ  వైఎస్సార్ అంటే వైఎస్ షర్మిల.  వైఎస్ షర్మిలను దీవించాలి.  వివేకా ను చంపిన వాళ్లకు ,షర్మిల కు మద్య పోటీ.  నాన్న చివరి కోరిక షర్మిలను ఎంపీ చేయాలని.  వివేకా చివరి కోరికను నెరవేర్చాలి. వైఎస్సార్ పోలికలు షర్మిల లో ఉన్నాయి.  అవినాష్ రెడ్డిని ఓడించాలని అన్నారు.
కిల్లి కృపారాణి మాట్లాడుతూ  జగన్ కోసం ఎంతో కష్టపడ్డ.  ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టా.  ఇలాంటి నన్ను జగన్ పక్కన పెట్టారు.  కష్టపడ్డ నాకు గుర్తింపు లేదు.  మాకు వైఎస్సార్ దేవుడు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ది. వైఎస్సార్ ను వైఎస్ షర్మిల లో చూస్తున్నాం.  షర్మిలమ్మ న్యాయకత్వం లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది. - జగన్ ఒక నియంత.  ఈ నియంత ను గద్దె దించాలి.  షర్మిలమ్మ కి కడప ఎంపీగా ఇక్కడ ప్రజలు అవకాశం ఇవ్వాలని అన్నారు.

Related Posts