YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

శాంతి స్వరూప్ కన్నుమూత

శాంతి స్వరూప్ కన్నుమూత

హైదరాబాద్, ఏప్రిల్ 5
తొలితరం తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ ఇక లేరు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దూరదర్శనలో వార్తలు చదివిన తొలి యాంకర్ ఆయనే. ఆయన స్ఫూర్తితోనే చాలా మంది న్యూస్‌ ప్రజెంటర్స్‌గా రాణిస్తున్నారు. 1978లో ఉద్యోగంలో జాయిన్ ఆయన 1983 నుంచి వార్తలు చదువుతున్నారు. 2011లో పదవీ విరమణ చేశారు. 1983 బాలన దినోత్సవం సందర్భంగా శాంతిస్వరూప్‌ తొలి వార్తల బులెటిన్ చదివారు. దూరదర్శన్‌ ఛానల్‌లో సాయంత్రం 7 గంటలకు ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. అందులో మొదటి వార్తగా బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు ప్రారంభించారు అని చదివారు. ఇలా 15 నిమిషాల పాటు తెలుగులో తొలి వార్తల బులెటిన్ ప్రజలకు పరిచయం చేశారాయన. అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రస్తానం 2011 వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. తెలుగు వార్తా చరిత్ర చెబితే శాంతి స్వరూప్‌కి ఒక చాప్టర్ ఉంటుంది.  

Related Posts