YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అసెంబ్లీకి రాలేదు..పంటపోలాలలో తిరుగుతున్న కేసీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్

అసెంబ్లీకి రాలేదు..పంటపోలాలలో తిరుగుతున్న కేసీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరారాబాద్
ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాల సందర్శనకు బయలుదేరారు. శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యత తో పంట పొలాలు తిరుగుతున్న మీకు మా ప్రభుత్వం తరఫున  పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టండని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు అడుగంటాయి.. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణం. ప్రాజెక్టులో పై మీరు ఎప్పుడు చర్చకు రమ్మన్న రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  మీరు అధికారం నుండి దిగేనాటికి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత నీటి నిల్వలు పై చర్చిద్దామని అన్నారు.
ఈరోజు తాగు ,సాగు నీటికి వాటిని ఎలా వాడమో  స్పష్టంగా చెప్పడానికి ,చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.  కరువు కాంగ్రెస్ తెచ్చింది అంటే మీరు అనుభవజ్ఞులు ..ఇలా అర్ధం లేకుండా మాట్లాడడం సరికాదు. కరువుకు బీఆర్ఎసొ ,కాంగ్రెస్ కారణం కాదు.
మీరు రాజకీయంగా నిజంగా బీజేపీ తో లేనట్లయితే తెలంగాణ ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలను కాపాడినట్లయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. మీరు రండి కలిసి వెళదాం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. తెలంగాణలో నీటి లభ్యత, భూగర్భ జలాలు అడిగినటువంటి అనేక సంఘటనలు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి మీరు కూడా రావలసిందిగా కోరుతున్నాం.. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.. రైతుల దగ్గర మొసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేస్తున్నాడు. మీరు కూడా రండి దీక్ష గల్లీలో కాదు ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర చేయాలి. మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదు తెలంగాణ రైతన్న ఆదుకునే ప్రయత్నం చేయలేదు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యలేదు మీరు ఎప్పుడు అడగలేదు. మీకు జాతీయ ప్రాజెక్టు అడిగే ధైర్యం కూడా లేదు. రైతుల ప్రయోజనాల గురించి మీరు ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసి  తెలంగాణ ప్రయోజనాలను నరేంద్ర మోడీ దగ్గర అడుగుదాం. మాకు కేంద్రంతో కొట్లాడి ఆలోచన లేదు ఎటువంటి భేషాజాలం లేదు కేంద్రం సహకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
మధ్యవర్తిగా అధికారంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా మీరు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  మిగతా నాయకత్వం ముందుకు రండి.. రాష్ట్ర ప్రయోజనాల దృశ్యా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. కెసిఆర్  పర్యటన చేసుకోవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వానికి సూచనలు చేసే అవకాశాన్ని ఇస్తున్నాం. నియంతృత్వంగా ఎక్కడ వి. వహరించడం లేదు స్వేచ్ఛగా తిరగవచ్చు. మా అధికారులు కూడా మీకు సహకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ గా డిమాండ్ చేస్తున్న మీరు పొలాల్లోకి వెళ్లి అక్కడ ఇక్కడ ఎండిపోయిన వాటిని కోసుకొచ్చి రోడ్లమీద వేసి రాజకీయ నాయకుడు హోదాకు తగిన విధంగా బిహేవ్ చేయడం లేదని అన్నారు.
రైతులను ఆదుకునే ఆలోచన ఉంటే కేంద్రం దగ్గరికి వెళ్దాం కేంద్రంతో కొట్లాడి ప్రకృతి వైపరీత్యం కింద కరువుకు సంబంధించి నిధులు తెచ్చుకుందాం అందుకు సహకరించాలని కోరుతున్నా. మాజీమంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ నేతన్నల మీద కాంగ్రెస్ కి ఎందుకు ఇంత కక్ష అంటున్నారు. 3 నెలల్లో మేము ఎం కక్ష చేసాం కేటీఆర్. మీరు గతంలో బతుకమ్మ చీరల  పెండింగ్ పైసలు ఇయ్యక వాళ్ళు ఇబ్బంది పడుతుంది మీరు చేసిన పాపమే కదా అని నిలదీసారు.
వాళ్ళకి 24×7 ఉపాధి ఉండే విధంగా టేస్కో ని పటిష్టం చేస్తూ రాష్ట్రంలో అవసరమున్న ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్న. నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయ చట్రంలో  పడకండి. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పాత బకాయిలు ఉన్నప్పటికి మా ప్రభుత్వం మీ పేమెంట్ చేస్తాం.. బతుకమ్మ చీరల పేరు మీద కొంత మంది బినామీలకూ మాత్రమే లబ్ది జరిగిందనె ఆరోపణలు ఉన్నాయని అన్నారు.
బతుకమ్మ చీరల కంటే ఎక్కువగా కార్మికునికి ,యజమానికి పని ఉండే విధంగా కాపాడే బాధ్యత మాది. 3 నెలల్లో మేము మొత్తం వస్త్ర పరిశ్రమ ముంచేసినట్టు మాట్లాడితే మీకు తగదు. మీకు ఏమైనా బాధ్యత గల సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ జిల్లా మంత్రి గా మీకు సహకరించడానికి నేను ఉన్నా. గీతన్న నేతన్నా  వేరు కాదు మీకు అండగా ఉక్కు కవచంలా ఉండే బాధ్యత నాది. మీ కష్టం నా కష్టంగా భావించి మీకు అండగా ఉంటానని అన్నారు.

Related Posts