కర్నూలు, ఏప్రిల్ 6
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వైద్యరంగంలో జగన్ సర్కార్ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. ఖరీదైన చికిత్సలను సైతం ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు ఉచితంగానే చికిత్స అందిస్తున్నారు. అలానే పేదల కోసం క్యాన్సర్ ఆస్పత్రిని సైతం నిర్మించారు. ఈ వ్యాధికి గురైన ధనికులైతే ఏదోలా మేనేజ్ చేస్తారు. మరి మధ్యతరగతి, పేదవారి సంగతేంటి? అలాంటివారి కోసమే జగన్ ప్రభుత్వం ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో కర్నూలు క్యాన్సర్స్ ఆస్పత్రి నిర్మాణం జరిగింది.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పేదవారి కోసం ప్రారంభించిన సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనం. అలానే పేద వారు ఆస్పత్రులకు వెళ్తే.. ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుడదనే లక్ష్యంతో వైద్య రంగలో అనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. నూతనంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, పలు ప్రాంతాల్లో అత్యాధుకని ఆస్పత్రుల నిర్మాణం చేస్తున్నారు. అలానే కర్నూలు పట్టణంలో క్యాన్సర్ రోగుల కోసం ఆస్పత్రిని నిర్మించారు. క్యాన్సర్ రోగులకు అత్యాధునిక చికిత్స కోసం రూ. 120 కోట్లతో , 200 పడకల స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను కర్నూలు లో ఏర్పాటు చేసింది జగన్ సర్కార్.క్యాన్సర్ వైద్యం ఖర్చుతో కూడుకున్నదనే విషయం అందరికి తెలిసిందే. అలాంటి ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలు చేయించుకోలేరు. అందుకే కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు ద్వారా అలాంటి ఖరీదైన వైద్యం పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు సీఎం జగన్. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ఒక వరంలాంటిది. గతంలో క్యాన్సర్ వైద్యం కోసం రాయలసీమ ప్రాంత రోగులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లేవారు. కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కావడంతో ఆ నగరాలకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది.ఆస్పత్రిలో సర్జికల్, మెడికల్, రేడియేషన్, అంకాలజీ తదితర విభాగాలన్నీ అందుబాటులో ఉంటాయి. పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులతో సహా పరిశోధనలకు అవకాశం కల్పించేలా ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ కూడా సహకారం అందించింది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.54 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఇక ఈ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ విషయానికి వస్తే..2017 లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట ను ఏపికి మంజూరు చేసింది. అయితే చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. చివరకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనవరి 2019లో నాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఎన్నికల కోడ్ వల్ల నిర్మాణ పనులు ప్రారంభం అవ్వలేదు.2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక ఆసుపత్రి నిర్మాణ పనులు అక్టోబర్ 2019లో ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో వేగంగా నిర్మాణ పనులు జరిగి ఫిబ్రవరి 2024 లో పూర్తయ్యాయి. త్వరలో ఈ ఆస్పత్రికి పేదలకు అత్యుత్తమ క్యాన్సర్స్ చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో పేద ప్రజల సంక్షేమం, ఆరోగ్యపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అందుకు నిదర్శనమే మెడికల్ కాలేజీల నిర్మాణం, పెద్ద పెద్ద ఆస్పత్రుల నిర్మాణం మొదలైనవి. ఇలాంటి పేదల కోసం పరితపించే నాయకుడే అధికారంలో ఉంటే.. మరిన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.