YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సగం మంది ఇతర పార్టీలకే

సగం మంది ఇతర పార్టీలకే

నెల్లూరు, ఏప్రిల్ 6
పొత్తులో భాగంగా 60, 50, 40 సీట్లంటూ ఊరించి చివరికి జనసేన పార్టీని 21 సీట్లకే పరిమితం చేశాడు టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు. అదే మహా ప్రసాదం అని సంతోషపడుతున్నాడు పవన్ కళ్యాణ్. పోని ఇచ్చిన 21 స్థానాలు అచ్చంగా జనసేనకే కేటాయించారా అంటే లేదట. 21 సీట్లలో పార్టీ కోసం పని చేసిన 11 మందికి మాత్రమే టికెట్ కేటాయించారని.. మిగతా 10 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలో దిగారని తెలిసి జనసేన కేడర్ షాక్ లో ఉంది. ఇలాంటి పొత్తులు, పొత్తు ధర్మం ఎక్కడా చూడలేదు అని వాపోతున్నారు గ్లాస్ పార్టీ నేతలు. పైగా పవన్ దీనిపై మౌనంగా ఉండటం తెలిసే టీడీపీ వారికి టికెట్లు కేటాయించడం వారిని మరింత బాధపెడుతుంది.గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులే.. ఇప్పుడు ఎన్నికల ముందు జనసేనలో చేరి టికెట్లు దక్కించుకోవడం చూసి జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన రెండు మిత్రపక్ష పార్టీలే అయినప్పుడు పొత్తులో భాగంగా ఆ సీట్లు టీడీపీనే ఉంచుకుని జనసేనకు వేరే చోట కేటాయించవచ్చు కదా. కానీ ఇలా చేయడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిన్నటి వరకు జనసేన పెండింగ్ లో ఉంచిన అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల్లో సైతం తాజాగా సోమవారం టీడీపీ నేతలే జనసేనలో చేరి టికెట్లు దక్కించుకోవడం చూసి జనసేన నేతలు మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన మండలి బుద్దప్రసాద్, నిమ్మక జయకృష్ణలు సోమవారం పవన్‌ సమక్షంలో జనసేనలో చేరి ఆ రెండు టికెట్లు దక్కించుకోవడం విశేషం.అంతేకాక జనసేనకు కేటాయించిన యలమంచిలి, భీమవరం స్థానాల్లో పార్టీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు పంచకర్ల రమేష్, అంజిబాబు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీచేశారని.. ఇప్పుడు పొత్తు తర్వాత వారు జనసేనలో చేరిన విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు గుర్తుచేసుకుని బాధపడుతున్నారు. ఇవి నిజమైన పొత్తు రాజకీయాలు ఎలా అవుతాయని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.పొత్తులో సొంత పార్టీ నాయకులకు అన్యాయం చేస్తున్న అధినేత పవన్‌కళ్యాణ్‌ తీరుపట్ల జనసేన నేతలు, పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. అసలు టీడీపీ–జనసేన మధ్య ఉంది పొత్తులు అనేకంటే కుమ్ముక్కు రాజకీయాలు అనడమే కరెక్ట్ గా సరిపోతుందని మండి పడుతున్నారు. పవన్.. చంద్రబాబుతో కుమ్మక్కై చివరికి సొంత పార్టీ నాయకులనే మోసం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts