YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫోన్ టాపింగ్ కేసులు సాధ్యమేనా

ఫోన్ టాపింగ్ కేసులు సాధ్యమేనా

హైదరాబాద్, ఏప్రిల్ 6,
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణలో వెల్లడవుతున్న విషయాలు అంటూ మీడియాలోకి వస్తున్న అంశాలపై విస్తృత ప్రచారం జరుగుతోంది.  రాజకీయ హడావుడి చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది. ట్యాపింగ్ అలా జరిగిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ నిరూపించగలరా అన్నది మాత్రం సందేహంగాే మారింది. న్యాయనిపుణులు కూడా ట్యాపింగ్ అంశాన్ని నిరూపించడం అసాధ్యమన్న భావనలో ఉన్నారు. ఎందుకంటే అసలు ఇప్పటి వరతూ ఒక్కటంటే ఒక్క కేసు కూడా టెలిగ్రాఫ్ చట్టం కింద పెట్టలేదు.    టెక్నాలజీ  కనిపించని  ఈ కాలంలో ఇంకా అసాధ్యమన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు ట్యాపింగ్ పేరుతో తెలంగాణలో జరుగుతున్నహడావుడిలోనూ ట్యాపింగ్ కేసు కాదు. బ్లాక్ మెయిల్ చేయడం .. డబ్బులు వసూలు చేయడం వంటివి పెడుతున్నారు. అంటే ట్యాపింగ్ ద్వారా ఫలానా నేరాలు చేశారని అంటున్నారు. అందుకే  కేటీఆర్ ఏమీ చేయలేరని స్టేట్‌మెంట్ ఇచ్చారు.   ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూనే తిరుగుతోంది.  అనేక రకాల ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ విషయంలో  మాజీ మంత్రి కేటీఆర్ చాలా డేరింగ్ ప్రకటన చేశారు. కేటీఆర్ ధైర్యానికి చాలా కారణాలు ఉన్నాయని అనుకోవచ్చు. అందులో మొదటిది ఫోన్ ట్యాపింగ్ అనే నేరాన్ని ఇప్పటి వరకూ నిరూపించలేదు. నిరూపించే టెక్నాలజీ ఉందా అది మన న్యాయవ్యవస్థను మెప్పిస్తుందా అన్నదానిపై ఎన్నో డౌట్లు ఉన్నాయి. అందుకే టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఇంత వరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేకపోయారని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ పోలీసులు టెలిగ్రాఫ్ యాక్ట్ కేసు పెడతామని చెప్పారు కానీ.. ఇంత వరకూ పెట్టారో లేదో స్పష్టత లేదు.  ప్రస్తుతం తెలంగాణలో ట్యాపింగ్ ఇష్యూ మీద జరుగుతున్న  వ్యవహారం విచారణలు ఏవీ నిజమైన ట్యాపింగ్ కేసు కాదు. ట్యాపింగ్ చేసి ఏం చేశారన్నదానిపైనే విచారణ జరుపుతున్నారు. ఫలానా చోట్ల డబ్బులు పట్టుకున్నామని వారిని బ్లాక్ మెయిల్ చేశామని  ఫలానా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని ఆస్తులు రాయించుకున్నారన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  వీటి ఆరోపణలకు మూలం ట్యాపింగ్.  ప్రత్యేకంగా వార్ రూముల్ని పెట్టుకుని ట్యాపింగ్ వ్యవహారాల్ని నడిపించారని పోలీసులకు స్పష్టంగా తెలుసు. కానీ నిరూపించే ఆధారాలు లేవు.  సిరిసిల్ల, పాలకుర్తిలో వార్ రూముల్ని పెట్టారని.. అక్కడ ఏ పోలీసు అధికారులు పని చేశారో కూడా తెలుసు. కానీ అక్కడ వారు ట్యాపింగే చేశారన్నదానికి మాత్రం ఆధారాలులేవు.          ఎస్ఐబీ టీమ్ మొత్తం ట్యాపింగ్ ఆధారాల్ని ధ్వంసం చేశారని  పోలీసులు కేసులు పెట్టారు.   పోలీసులు హార్డ్ డిస్క్‌ల  అవశేషాలను  స్వాధీనంచేసుకున్నారు.   ప్రణీత్ రావు ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారని హార్డ్ డిస్కుల్ని కట్ చేసి మూసీలో విసిరేశారని .. వాటిని స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు. వాటిని ఎలా రీ ట్రీవ్ చేయాలన్నదానిపై పోలీసులు తర్జన  భర్జన పడుతున్నారు. నిజానికి అది అసాధ్యమని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ట్యాపింగ్ పరికరాలను కూడా కనిపెట్టలేకకపోయారు.  అప్రూవర్ గా మారేందుకు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు సిద్ధమయ్యారని  ప్రచారం జరిగింది.  కానీ ఆయన అమెరికా నుంచి రాలేదు.  ట్యాపింగ్ గురించి ఆధారాలు సేకరించడం దాదాపు అసాధ్యం కాబట్టే ఆయన ధైర్యంగా రాలేదని  అమెరికాలోనే ఉన్నారని అంటున్నారు. ట్యాపింగ్ విషయంలో నిందితులు అప్రూవర్లుగా మారి పరికరాలు ఎక్కడ్నుంచి తెప్పించారు.. ఎవరు తెప్పించారు అనే విషయాలు కనిపెట్టి.. ఆ పరికరాలను స్వాధీనం చేసుకోగలిగితే కొంత మేర ట్యాపింగ్ ను నిరూపించడం సాధ్యం అవుతుందన్న వాదన ఉంది.  కానీ ఆ ప్రయత్నాలు ఇంత వరకూ ఫలించలేదు. రవిపాల్ అనే సాంకేతిక నిపుణుడు మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఇంత వరకూ ఆయనను పిలిపించలేకపోయరు. ట్యాపింగ్‌ను నిరూపించలేకపోవచ్చు కానీ.. ట్యాపింగ్ చేసి వారు చేసిన అక్రమాల విషయంలో  మాత్రం.. నిరూపించడానికి అనేక ఆధారాలు లభించే అవకాశం ఉంది. అక్రమాస్తుల్ని నెలుగులోకి తెచ్చి.. వాటిని సాక్ష్యాలు చూపించవచ్చు.  ఏసీబీ కేసులు.. ఇతర ఏజెన్సీల ద్వారా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చవచ్చు.  ఇప్పటి వరకూ ఆ కోణంలోనే విచారణ జరుగుతోంది కానీ.. నిజంగా ట్యాపింగ్ వరకూ కేసులు రాలేదు. అయితే నేర పరిశోధనలో ఏదీ అసాధ్యం కాదు.  ట్యాపింగ్ కూడా. నిరూపించే మార్గాలను అన్వేషించడమే కీలకం.  

Related Posts