YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రపంచంలో భారత్ కు అత్యున్నత గౌరవం పెరిగింది

ప్రపంచంలో భారత్ కు అత్యున్నత గౌరవం పెరిగింది

హైదరాబాద్
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు దిశనిర్దేశం చేసారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు, బిజెపి కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ,  బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్ పేయి,  లాల్ కృష్ణ అద్వానీ   నేతృత్వంలో భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది.  నేడు నరేంద్ర మోదీ  నేతృత్వంలో గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రతి కార్యకర్త చాలా సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నారు. 1980లో కశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసి బాప్ కా నినాదంతో ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయింది. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ లో జిన్నా రాజ్యాంగం నడిచేది.  ఆర్టికల్ 370ని రద్దు చేసి.. నేడు జమ్మూ కశ్మీర్ లో కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరుగుతోంది. నరేంద్ర మోదీ గారి నాయత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్ ప్రజలకు అనేక రకాల హక్కులు కల్పించి, అభివృద్ధి చేస్తున్నాం. లాల్ కృష్ణ అద్వానీ  హిమాచల్ ప్రదేశ్ లో ఇచ్చిన హామీ ప్రకారం మోదీ నేతృత్వంలో అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగింది. ముస్లిం ఆడబిడ్డలకు సోదరుడుగా మోదీ  అన్నిరకాల హక్కులు కల్పించి అండగా నిలబడ్డారు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ  అంత్యోదయ విధానం ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రతి పేదవాడి అందాలనే లక్ష్యానికి అనుగుణంగా.. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో పేద మహిళలకు ఇండ్ల నిర్మాణం, వంట గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్లు ఇవ్వడం, మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి అనేక పథకాల ద్వారా సంక్షేమం అందుతోంది.మోదీ  ప్రపంచంలో అత్యధిక ప్రజాధరణ కలిగిన నాయకుడిగా నిలిచారు. ప్రపంచంలో భారత్ కు అత్యున్నత గౌరవం పెరిగింది. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది.
భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిచేలా మోదీ  కృషి చేస్తున్నారు.   రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే కు 400 సీట్లు సాధించే లక్ష్యంతో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్.. అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని దేశంలో ప్రతి ఇంటింటా నినదిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ కనుమరుగవుతోంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను గాలికొదిలేశారు. గారడీ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి 100 రోజుల్లోనే అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. మీరిచ్చిన హామీలు అమలు జరగలే. తెలంగాణ గడ్డమీదకు వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డికి హామీల అమలుపై దృష్టి లేదు.. కాని, పార్టీ ఫిరాయింపులపై మాత్రమే దృష్టి ఉంది. ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు.
గ్యారంటీలను నమ్మి ప్రజలు ఓటేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన బాధ్యతను నిర్వర్తించడంలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోంది. కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది.తెలంగాణలో ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు అండగా, అభివృద్ధికి భరోసాగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది. మీరెన్ని ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా.. రాహుల్ గాంధీ, కేసీఆర్ లాంటివారు బిజెపిని ఏం చేయలేరు. నరేంద్ర మోదీ  తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి డబుల్ డిజిట్ తో మెజారిటీ స్థానాలు గెలుస్తుంది. తెలంగాణ అభివృద్ధి, ప్రజలకు సంక్షేమం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలమైన శక్తిగా ఎదుగుతోంది.  రానున్న రోజుల్లో అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో బిజెపి ని ఒక శక్తిశాలిగా తీసుకెళ్తాం. అందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరుతున్నాను. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సీట్ల సాధించేలా అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Related Posts