బీజాపూర్
పోలీసులు,మావోయిస్టుల మధ్యల భారీ ఎన్కౌంటర్ జరిగింది.. గ్రే హౌండ్స్, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని పూజారి కంకేర్లోని కర్రిగుట అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వచ్చాయి. ఘటనా స్థలం నుండి ఒక ఎల్ఎంజీ, ఏకే 47 సహా అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు కూడా ఉన్నాయి. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎన్కౌంటర్ గురించి సమాచారం ఇచ్చారు. ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసు నమోదయింది.