YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో మరో కొత్త పథకం.. వారికి ఏడాదంతా పని..!

తెలంగాణలో మరో కొత్త పథకం.. వారికి ఏడాదంతా పని..!

యాదాద్రి భువనగిరి
చేనేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ఆదుకోరా ? ఆయన ప్రశ్నించారు. నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని మండిపడ్డారు. గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నేత కార్మికుల కోసం త్వరలో కొత్తగా ' నేతన్న భరోసా ' పథకాన్ని ప్రవేశపెట్టనుంది. చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు . రాష్ట్రంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ఏర్పాటు, హ్యాండ్‌లూమ్‌ పార్కు పునరుద్ధరణ, కొత్త పవర్‌లూమ్‌ క్లస్టర్‌ల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు కొత్త సాంకేతిక వస్త్ర విధానాన్ని ఆవిష్కరించాలనికాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని చేనేత సంఘాలకు పని కల్పించే చర్యలు చేపట్టిందని.. ఇప్పటికే రూ.53 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసిందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. గతంలో చేనేత సహకార సంఘాలకు పెండింగ్‌లో ఉన్న రూ.8.81 కోట్ల బకాయిలను విడుదల చేసిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం టెస్కోలో లభ్యంకాని వస్త్రాలకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ తీసుకుంటే తప్ప ప్రైవేటు ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉండదు.

Related Posts