హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య ఒక రాజకీయ కుట్ర అని అయన కూతురు సునీత అన్నారు. హైదరాబాద్ లో ఆమె జస్టిస్ ఫర్ వివేకా పేరుతో ప్రెసెంటేషన్ ఇచ్చారు. సునీత మాట్లాడుతూ సిబిఐ కేసులతో జగన్ అరెస్టై జగన్ జైల్లో ఉన్నారు. పార్టీని షర్మిల భుజం వేసుకొని నడిపించింది. ఉప ఎన్నికల్లో విజయం తర్వాత షర్మిలకు ఆదరణ వస్తుందని పక్కన పెట్టారు. 2014 ఎన్నికల్లో షర్మిల కడప నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. కడపలో షర్మిల ఉంటే ప్రమాదమని భావించి విశాఖకు పంపాలని నిర్ణయించారు. కడప స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓటమి పాలయ్యారు. జిల్లా అంతా వివేక చూసుకున్నారు. పులివెందుల మాత్రం అవినాష్ కుటుంబానికి అప్పగించారు.
పులివెందులలో అవినాష్ కుటుంబం వెన్నుపోటుతో వివేక ఓడిపోయారు. ఓటమి తర్వాత తేరుకొని 2019 ఎన్నికలు వివేక సిద్ధమయ్యారు. జగన్ పాదయాత్రలో వివేక అప్పుడప్పుడు కలిసేవారు. పార్టీ నిర్మాణానికి నిరంతరం సలహాలు ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా తిరిగారని అన్నారు.
అదే సమయంలో షర్మిల పేరు మళ్లీ కడప సీటు కోసం చర్చకు వచ్చింది. షర్మిల కడప ఆత్మీయ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. కొన్ని రోజుల తర్వాత వివేక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత పులివెందులలో వివేక ఓటు జాబితాలో లేకుండా పోయింది. వివేకను వ్యతిరేకించే వారే ఓటు తొలగించారని అర్థమైంది. ఓటు తొలగింపు పై వివేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలను కడప నుంచి పోటీ చెయ్యాలి అని వివేక ఒత్తిడి చేశారు. వివేక హత్య ఒక రాజకీయ కుట్ర . పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ జరిగింది. చర్చిలో వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు ముందుకు వచ్చింది. భాస్కర్ రెడ్డి పోటీ చేయడానికి వివేకా అంగీకరించలేదు. షర్మిల లేదా విజయమ్మ పోటీ చేయాలని వివేక చెప్పారు. ఈ క్రమంలో వివేకకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వివేకాకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జగన్ వ్యతిరేకించారు. జగన్ విజయమ్మ కాంగ్రెస్కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. 2011 ఉప ఎన్నికల్లో జగన్ విజయమ్మ పోటీ చేశారు. ఆ తర్వాత క్రమంలో వివేక కాంగ్రెస్కు రాజీనామా చేశారు. జగన్ తో ఉండాలని నిర్ణయించి వివేక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారని అన్నారు.