YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అత్యంత హేయకరమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్

ఫోన్ ట్యాపింగ్  వ్యవహారంతో అత్యంత హేయకరమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్

హైదరాబాద్
గడిచిన గత పది సంవత్సరాలలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక మాఫియా లాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసిందని బీజేపీ నేత ఎంపి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. . చరిత్రలో ఎప్పుడు లేని విధంగా  ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ, అన్ని పరుధులను తుంగలో తొక్కుతూ రాజ్యాంగ విలువలని అపహస్యం చేసింది. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులను వాడుకొని డబ్బు మూటలను పోలీసు వాహనాల్లో తరలించడం తద్వారా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలని నీచమైన ఆలోచన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా దేశ విద్రోహ చర్యకు అంతకంటే ఎక్కువ కుట్రకి తెర లేపిన బి ఆర్ ఎస్ ప్రభుత్వం మీద పూర్తిస్థాయి విచారణ జరిపించాలి అని ఈరోజు గవర్నర్ రాధాకృష్ణన్ కు విన్నవించడానికి రాజ్ భవన్ కి రావలసి వచ్చింది. వెంటనే బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ కుట్రను పూర్తిస్థాయిలో విచారించుటకు కేంద్ర దర్యాప్తు సంస్థ సి.బి.ఐ కి అప్పజెప్పాల్సిందిగా కోరామని అన్నారు.

Related Posts