YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా నేడు భారీగా నగదు రూ. 6,53,35,400 సీజ్

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా నేడు భారీగా నగదు  రూ. 6,53,35,400 సీజ్

హైదరాబాద్, ఏప్రిల్ 06
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో భారీగా 6 కోట్ల 53 లక్షల 35 వేల 400 రూపాయలు పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ తెలిపారు.
జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా  1 లక్ష 77 వేల 300 రూపాయలు పట్టుకున్నారు. అదేవిధంగా  ఇతర పోలీస్ అథారిటీ ఐటీ శాఖ ద్వారా  6 కోట్ల 53 లక్షల 35 వేల రూపాయలు పట్టుకొని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎక్స్ సైజ్ శాఖ ద్వారా అక్రమ మద్యాన్ని 80.95 లీటర్ల ను పట్టుకున్నారు. అంతేకాకుండా 65,390 రూపాయల విలువగల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి లో భాగంగా నగదు ఇతర వస్తువుల పై 14 పిర్యాదులు రాగా వాటిని క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కారం చేశారు. ఏడుగురిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. అక్రమ మద్యం ముగ్గురిపై ప్రోహిబిషన్ కేసు నమోదు చేసి ఒక్కరి పై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు 12 కోట్ల 49 లక్షల 27వేల 270 రూపాయలు నగదు తో పాటుగా 1 కోటి 73 లక్షల 26 వేల 343 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 19,358.43 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. 139 మందిపై కేసులు నమోదు చేసి 134  అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కు సంబంధించిన నగదు, ఇతర వస్తువుల పై 269 పిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారు. 181 మంది పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

Related Posts