చెన్నై, ఏప్రిల్ 8,
తమిళనాడుకు అతి సమీపంలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించడంపై పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ డీఎంకే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కచ్చతీవు ద్వీపం మన చేతి నుంచి వెళ్లిపోవడానికి కారణం కాంగ్రెస్సే అని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఆరోపించడం ఇప్పుడు చర్చేనీయాంశమైంది. 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు బండారి నాయక మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కచ్చతీవు శ్రీలంక వశమైంది. వాస్తవం అయితే.. ఇందిరాగాంధీ అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుని ఉంటారని కొందరు పేర్కొంటున్నారు.అయితే నాటి నిర్ణయాలను తప్పుగా ఎత్తి చూపుతున్న ప్రధాని నరేంద్రమోదీ.. నాడు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మోదీ నిర్ణయాలు అందరికీ నచ్చినా.. భవిష్యత్‌లో అవి చాలా మందికి తప్పుగా అనిపించవచ్చు అన్న చర్చ కూడా జరుగుతోంది. కాలమాన పరిస్థితుల ఆధారంగా మాజీ ప్రధానులు పనిచేశారని, అప్పటి ఆలోచనలు, నిపుణులు, భద్రత అంశాల మేరకు నిర్ణయాలు తీసుకుని, ఒప్పందాలు చేసుకుని ఉంటారని చాలా మంది పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. నాటి ప్రధానులకు దూర దృష్టి ఏది అని మరికొందరు వాదిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న ఏ నేతకైనా దూరదృష్టి అనేది ముఖ్యం అని పేర్కొంటున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు, ఒప్పందాలు చేయాలని సూచిస్తున్నారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు శాపాలుగా మారతాయని పేర్కొంటున్నారు. అందులో భాగమే కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు అప్పగించే నిర్ణయమని అంటున్నారుఇందిరా నిర్ణయంపై ఒకవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, తాజాగా మరో దీవి కూడా చేతులు మారిన విషయం వెలుగులోకి వచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నెహ్రూ అనేక నిర్ణయాలు దేశానికి నష్టం కలిగించాయన్న వాదన ఇప్పటికే ఉంది. తాజాగా మన ద్వీపాన్ని పొరుగున ఉన్న మయన్మార్‌కు అప్పగించడం, ఆ తర్వాత ఆ ద్వీపాన్ని మయన్మార్ చైనాకు అప్పగించడం చర్చనీయాంశమైంది.భారత దేశం చుట్లూ అనేక దీవులు ఉన్నాయి. అవన్నీ చాలా ఏళ్లుగా భారత అధీనంలోనే ఉన్నాయి. కానీ, నెహ్రూ మయన్మార్‌కు అతి సమీపంలో ఉన్న భారతీయ దీవులు అయిన కోకో ఐల్యాండ్స్‌ను మన పొరుగున ఉన్న మయన్మార్‌కు పుక్కిటికి రాసిచ్చేశారు. ఎప్పుడు సైనిక పాలనలో ఉండే మయన్మార్.. తన స్వప్రయోజనాల కోసం దానిని చైనాకు అప్పగించింది. మనకు కోకో దీవులు పనికిరావని నెహ్రూ భావించడమే ఇందుకు కారణంభారత్ నుంచి మయన్మార్, అక్కడి నుంచి చైనా అధీనంలోకి వెళ్లిన కోకో ఐలాండ్స్‌లో ఇప్పుడు ఆ దేశం మిసైల్స్‌ను మోహరించింది. అదీ భారత్‌పైకి గురిపెట్టడం ఇపుపడు ఆందోళనకు కారణం. నెహ్రూ దూరదృష్టి లేకుండా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారత్‌కే ముప్పుగా మారడం గమనార్హం.