కర్నూలు
ఆర్థిక మంత్రి ఎక్కడ అంటున్నావు...మంత్రి ఎక్కడ ఉంటాడో నీకు తెలియదా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్లు అడిగే ప్రశ్ననా ఇది..అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.
30 ఏళ్ల రాజకీయ అనుభవం అనంతరమే నేను అధికారంలోకి వచ్చా,డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించా,నీ రాజకీయ ప్రస్థానంలో నీవు చేసిన అభివృద్ధి చూపిస్తావా నీతో పాటు నన్ను రమ్మంటావా నీకు,నీ అనుచరులకు నా వాహనాల్లో తీసుకెళ్లి అభివృద్ధి చూపిస్తా..చూసేందుకు వారం రోజులు పడుతుంది సిద్దమా అన్నారు..నీవు సింగిల్ గా రా నా కారు తీసుకుని వెళ్లి నేను చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తా..నీవు రైల్వే సహాయక మంత్రిగా ఉన్న సమయంలో కర్నూలుకు కోచ్ ఫ్యాక్టరీ తెచ్చానని చెప్పావు అది ఏమైంది..ఆ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు...మీ తండ్రిగారి రాజకీయ జీవితాన్ని అంతం చేసిన టిడిపి పార్టీలో నీవు చేరావు.. మీ నాన్న ఆత్మ క్షోభిస్తాది..నీకు రాజశేఖర్ రెడ్డి ఎంత మేలు చేశాడో ప్రజలందరికీ తెలుసు..గతంలో మీరు చేసిన అభివృద్ధి రాజశేఖర్ రెడ్డి పుణ్యమే..అతని కొడుకు వెంట ఉండక టీడీపీలో చేరావు..నువ్వు కేంద్రమంత్రిగా ఉండి ,కే.యి కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండి డోన్ ప్రజలకు ఏమి చేశారో చెప్పండి ..డోన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎందుకు అంత పొడవు పెంచారో ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు ప్రజలకు ఏమి చేస్తావో అది చెప్పు..సింగిల్ గా డోన్ నియోజకవర్గం లో ఏ గ్రామానికి వెళ్లే దారి నీకు తెలియదు..నువ్వా నా బుగ్గ పగులుతాది అంటున్నావు.. నీకు ఆదోని,ఏమిగనూరు,కర్నూలు ప్రజలు నీ బుగ్గ పగలగొట్టారు అది నీకు తెలియదా..నా బుగ్గ గురించి ప్రజలు చూసుకుంటారు..నేను చేసిన అభివృద్ధి చూపించేందుకు నేను సిద్ధం...నువ్వు సిద్దమా ..నన్ను ఓడించేందుకు లక్ష్యం పెట్టుకున్నావు..ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతావు నీకు నచ్చిన ఆట అడుదాం..గెలుచు చూద్దాం..లేదా నీకు నచ్చిన ఆట ఏదైనా చెప్పు నేను రెడీ అని సవాల్ విసిరారు.