YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

శవ రాజకీయాలు చేస్తున్న విపక్షాలు

శవ రాజకీయాలు చేస్తున్న విపక్షాలు

సిరిసిల్ల
సిరిసిల్ల జిల్లా డిసిసి కార్యాలయంలో  ఎమ్మెల్యే అది శ్రీనివాస్ , సిరిసిల్ల కాంగ్రెస్ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి  తో కలిసి మంత్రి పొన్నం  ప్రభాకర్ మీడియాతో మాట్లడారు.
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ,కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోది  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సిరిసిల్ల కేంద్రంగా  చేనేత కార్మికులతో బిఆరెస్ ,బీజేపీ లకు రాజకీయ ఆటలాడుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి.  మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. నేతన్నల పేరు మీద ఈ రెండు పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నారు. వారు చేస్తున్న రాజకీయాన్ని నేతన్నలకు , మీ అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. స్వతంత్రం అనంతరం నేతన్నల ప్రయోజనం కోసం ఏమైనా చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ మీద 12 శాతం జీఎస్టీ వేశారు. వారిని వేధించారని అన్నారు.
సిరిసిల్ల కి పవర్ లూమ్ కస్టర్ అడిగాం. అప్పుడు కనీసం నోరెత్తని పార్లమెంట్ సభ్యుడు ఏం ముఖం పెట్టుకొని 10 నాడు దీక్ష చేస్తున్నావు. ఈ 5 ఏళ్లలో ఎం చేశావని అడుగుతున్న. కేంద్రం నుండి ఒక్క రూపాయి అయిన సహాయ చేశావా. Sidp కింద 300 కోట్లు ఉంటే 25 శాతం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్దంగా ఉంది.. మిగిలింది కేంద్ర ప్రభుత్వం నుండి తేవాలి. ఈ పాపం ఎవరిది..550 కోట్ల బకాయి లు  చేసింది ఎవరు. మాకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన ఎవరిపైన అయిన కక్ష సాధింపు చర్యలు చెప్పటామ. బతుకమ్మ చీరలకి సంబంధించినవే 300 కోట్లు. ఆ బకాయిలు ఎందుకు చెల్లించలేదు. పెళ్లి అయిన వారికి అరుంధతి నక్షత్రం చుపెట్టినట్టు చుపెట్టావ్.. డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసిన సంతోషం ఏడాది ఉంటే తరువాత బాధలు యేడాది ఉన్నాయి. అన్ని సహకార సంఘాలకు పని చేసే ప్రతి ఒక్కరికీ పని ఇవ్వాలని ఉద్దేశ్యం మాకు ఉందని అన్నారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం మాకు పని లేదన్న మాట వినబడకుండ పని కల్పిస్తున్నాం. జీఓ నంబర్ 1 ద్వారా రాష్ట్రంలో అన్ని చేనేత ల నుండి వస్త్రాల కొనుగోలు చేయడానికి జీఓ తీసుకొచ్చాం. ఈ నాలుగు నెలల కాలంలో 120 కోట్ల ఆర్డర్ సిరిసిల్ల కి ఇచ్చాం. గతంలో పరిశ్రమ లేదా .. మీరు మీ కంట్రోల్ లో ఉండే ప్రయత్నం చేశారు.
మళ్ళీ అన్ని బాగు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో అమరవీరుల పేరు చెప్పి శవాల పేరు మీద పెలలు ఎరుకున్నట్టు వ్యవహరించారు. చావు మార్గం కాదు..ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టేద్దు. మేమంతా కలిసి సిరిసిల్ల నేత కార్మికులకు ఒక్క కష్టం కూడా రాకుండా చుస్కుంటాం. కేటిఆర్ ఒక ఆర్థిక సంవత్సరంలోకి మేము ఇచ్చామన్న ఆర్డర్స్ కి ఎక్కువే ఇస్తాం కానీ తక్కువ ఇవ్వం .సిరిసిల్ల నేతన్నల సం బకాయిలు అన్ని పేమెంట్ చేసే బాధ్యత మాది. ప్రతి రూపాయి పేమెంట్ చేస్తాం. ముఖ్యమంత్రి , ,ఉప ముఖ్యమంత్రి బట్టి  తో చర్చించామని అన్నారు.
ఒక దశలో ఇప్పుడు తరువాత దశలో మరింత పేమెంట్ చేస్తాం.వినోద్ ఇక్కడ చిప్ప చేతికిచ్చి అక్కడికి ఇండస్ట్రీ తీసుకుపోయాడు. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎం చేశానో చెప్పడానికి సిద్దంగా ఉన్నాం. మీరు ఎం చేశామో చెప్పకుండా అక్షింతలు పేరుతో ఓట్లు అడుగుతున్నారు.. నరేంద్ర మోడీ పేరు చెప్పి కూడా ఓట్లు అడిగే పరిస్థితి లేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ఈ పాపానికి బాధ్యులు కాదు. దీక్ష చేసే వారు ముందు దీనికి జవాబు చెప్పాలి. చేనేత మీద జీఎస్టీ వేసింది మీరు కాదా. నేతన్నలు వీరి ట్రాప్ లో పడకండి..మేము నష్టం చేస్తే మమల్ని నిలదీయండని అన్నారు.
10 సంవత్సరాల్లో మేము చేనేత వారిని కలుద్దమంటే ఆ ప్రకటిత కర్ఫ్యూ లా కలవని పరిస్థితి ఉండేది. ఆర్డర్స్ ఇస్తాం.. పెట్టుబడి కి డబ్బులు కూడా మేమే ఇస్తున్నాం. పవర్ సబ్సిడీ ఇష్యూ,యార్డు ఇష్యూ అన్నిటినీ చేయడానికి సిద్దంగా ఉన్నాం. పద్మశాలి కార్పోరేషన్ ఏర్పాటు చేశాం...సాంకేతికంగా వృత్తిని అభివృద్ధి చేస్తామని అన్నారు.
నేతన్న గీతన్న వేరు కాదు. గతంలో టెక్స్ టైల్ పరిశ్రమ వరంగల్ వెళ్తే నిరసనలు తెలిపాం. సిరిసిల్ల నేతన్నలు ఈ ఇబ్బంది ఉన్న..అధికారులు కూడా చెబుతున్న పవర్ బకాయిలు ఉన్న ఇబ్బంది పెట్టద్దని అన్నారు.
మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం అంత్యోదయ కార్డులు ఎగరగొట్టింది. రాష్ట్రం మొత్తం 12 వేల అంత్యోదయ కార్డు ఉంటే ఒక సిరిసిల్ల లోనే 12 వేల కార్డ్స్  ఉన్నాయి..అవి తీసేసింది మీరు కాదా. శవాల మీద రాజకీయాలు చేయకండి అని హెచ్చరిస్తున్నా. నేతన్నలు అదైర్యపడకండి .. మా ప్రభుత్వం లో ఎవరైనా ఉన్న నిలదీస్తాం. రాష్ట్రంలో ఎవరైనా కలిసే విధంగా స్వేచ్చగా పాలన అందిస్తున్నాం. రాబోయే కాలంలో సాంకేతికంగా మరింత అభివృద్ధికి తీసుకెళ్తాము. చేనేత కార్మికులకు చేతి నిండా పని కలిస్పిస్తాం. పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేస్తాం . ఇప్పటికీ 180 కోట్లు విడుదల చేశామని అన్నారు. .

Related Posts