YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మెదక్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి వెంకటరామిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించారు

మెదక్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి వెంకటరామిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించారు

హైదరాబాద్ ఏప్రిల్ 8
మెదక్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి వెంకటరామిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించారని బిజెపి ఎంపి అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు. మెదక్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై మెదక్ బిజెపి ఎంపి అభ్యర్థి రఘునందన్‌రావు సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే మళ్లీ చేస్తోందని, ప్రభుత్వ ఉద్యోగులతో వెంకటరామిరెడ్డి అక్రమంగా సమావేశం నిర్వహించడం సరికాదని హితువు పలికారు. వెంకటరామిరెడ్డి సమావేశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, తన ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపణలు చేశారు. తన ఫిర్యాదుపై వెంకటరామిరెడ్డికి మాత్రం సమాచారం ఇచ్చారన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి అందరూ పారిపోయారన్నారు. వెంకటరామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్నారని, బిఆర్‌ఎస్ నేతల తప్పుడు పనుల్లో ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ సహకరించి ఉద్యోగాలు కోల్పోవద్దని, న్యాయపరంగా తీసుకునే చర్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోవద్దని రఘునందన్ సూచించారు.

Related Posts