YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిం కర్తవ్యం.... ఖాళీ అవుతున్న జనసేన

కిం కర్తవ్యం.... ఖాళీ అవుతున్న జనసేన

ఏలూరు, ఏప్రిల్ 10
ఎన్నికలన్నాక ప్రతి పార్టీకి అసంతృప్తులు సహజం. టికెట్ దక్కలేదనో.. సరైన గౌరవం లభించలేదనో చాలామంది నేతలు పార్టీలను వీడుతారు. ప్రత్యర్థి పార్టీల్లో చేరుతారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ జాబితాలను విడుదల చేసింది. దీంతో చాలామంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రత్యర్థి పార్టీలో చేరారు. తరువాత పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను జనసేన, బిజెపికి విడిచి పెట్టాల్సి వచ్చింది. ఇలా కోల్పోయిన నియోజకవర్గాల్లో టిడిపి నేతలు పార్టీని వీడారు. వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ వంతు జనసేనకు వచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి టిక్కెట్ దక్కలేదు. దీంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడే వైసిపి వ్యూహం పన్నింది. అసంతృప్తితో ఉన్న వారిని వైసీపీలోకి రప్పిస్తోంది. దీంతో జనసేనలో ఒక రకమైన గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 40 వరకు అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని అంతా భావించారు. అటు జన సైనికులు సైతం అదే అంచనా తో ఉండేవారు. పవన్ సైతం తక్కువ సీట్లు ఇస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కీలక నేతలకు టికెట్లు ఖాయమని సంకేతాలు ఇచ్చారు. నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని సూచించారు. అయితే పొత్తు మూడు పార్టీల మధ్య ఉండడంతో సీట్ల లెక్క మారింది. ఆశించిన నియోజకవర్గాల సంఖ్య మారింది. సహజంగానే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న జనసేన కీలక నాయకులకు పవన్ టికెట్లు ఇవ్వలేకపోయారు. ఇది వారిలో అసంతృప్తికి కారణమైంది. అగ్నికి ఆజ్యం పోసేలా వైసీపీ వ్యవహరిస్తుండడంతో.. జనసేన కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. వైసీపీలో చేరుతున్నారు.ఇటీవల జనసేన పై ఆకర్ష్ ప్రయోగం ఫలిస్తోంది. చాలామంది నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన పోతిన మహేష్ తాజాగా వైసీపీలో చేరడానికి డిసైడ్ అయ్యారు. ముమ్మిడివరం, అమలాపురం ఇన్చార్జులు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు జనసేనకు రాజీనామా చేశారు. ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డివి రావు సైతం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఇలా రాజీనామా చేస్తున్న నేతలంతా గత ఎన్నికల్లో పోటీ చేసినవారే. త్రిముఖ పోటీలో మూడో స్థానంలో నిలిచిన వారే.అయితే పవన్ ఈ పరిణామాలన్నింటినీ ఊహించారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో.. చాలామందికి అన్యాయం తప్పదని భావించారు. అందుకే పార్టీ శ్రేణులను ముందు నుంచే అలర్ట్ చేస్తున్నారు. తన నిర్ణయాన్ని గౌరవించిన వారే తనవారని.. అతిక్రమించిన వారు తన వారు కాదని.. అటువంటి వారు అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా జనసేన నేతలు వైసీపీలో చేరడాన్ని పవన్ సైతం లైట్ తీసుకుంటున్నారు. పవన్ అభిమానించేవారు ఈసారి తప్పకుండా ఓటర్లుగా మారుతారని విశ్వసిస్తున్నారు. అందుకే నేతలు పార్టీని వీడినా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు నేతలు వెళుతున్న జనసైనికులు మాత్రం పెద్ద హైరానా పడటం లేదు.
కాపులే త్యాగాలు చేయాలా
న్ని రోజులు పవన్ చర్యలను పోతిన మహేష్ సమర్థిస్తూ వచ్చారు. కానీ పొత్తులో భాగంగా జనసేన తక్కువ సీట్లు తీసుకోవడాన్ని సహించలేకపోయారు. పొత్తులో భాగంగా టిడిపి బిజెపికి సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉందని.. కానీ జనసేన త్యాగం చేయడాన్ని పోతిన మహేష్ తప్పు పడుతున్నారు. అది కూడా ఒక కమ్మ నాయకుడి కోసం కాపు నేత త్యాగం చెయ్యాలా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ తీసుకునే నిర్ణయాలు సరికావని తేల్చి చెబుతున్నారు. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను సైతం పోతిన మహేష్ గుర్తు చేశారు. 15 నుంచి 20 సీట్లు టిడిపి ఇస్తే తీసుకోవాలా? తమ పార్టీకి టిడిపి కుక్క బిస్కెట్లు వేసినట్లు వేస్తే తీసుకోవాలా అని పవన్ ప్రశ్నించిన తీరును ప్రస్తావించారు. ఇప్పుడు ఏ బిస్కెట్లకు మీరు లొంగిపోయారంటూ పవన్ ను ప్రశ్నించారు. విజయవాడ వంటి రాజధాని ప్రాంతంలో తాము ఇన్నాళ్ళు జనసేన పార్టీని బతికించామని.. దానికి ప్రతిఫలంగా పవన్ తమను చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనకు జండా లేదు.. గాజు గ్లాస్ గుర్తులేదు.. అసలు జన సైనికులకు పట్టించుకునే నాధుడే లేడంటూ మహేష్ తేల్చి చెప్పారు. 40 లక్షల క్రియాశీలక కార్యకర్తలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కోరారు. మొత్తానికైతే కమ్మ నేత కోసం పవన్ కళ్యాణ్ కాపు నేతలను తప్పించారని పోతిన మహేష్ చేస్తున్న వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఈ కామెంట్స్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి.

Related Posts