YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

25 ఎంపీల లెక్క తేలింది...

25  ఎంపీల లెక్క తేలింది...

విజయవాడ, ఏప్రిల్ 10
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థులను ప్రధాన పార్టీలు దాదాపు ఖరారు చేశాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఒకవైపు అసెంబ్లీకి బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతూనే.. పార్లమెంట్‌ స్థానాలపైనా తీవ్ర స్థాయిలో కసరత్తు చేశాయి. ఆర్థిక, అంగ బలం, కుల సమీకరణాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశాయి. అధికార వైసీపీ కొద్దిరోజులు కిందట 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, తాజాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించేశాయి. ఇటు వైసీపీ మరోసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి.
ఆసక్తిని రేపుతున్న పోటీ
రాష్ట్రంలోని పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ అనేక చోట్ల ఆసక్తిని రేపుతోంది. శ్రీకాకుళం నుంచి మరోసారి కింజరాపు రామ్మోహన్‌ నాయుబరిలోకి దిగుతున్నారు. గడిచిన రెండు ఎన్నికల్లో రామ్మోహన్‌ నాయుడు విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం నుంచి రామ్మోహన్‌ నాయుడు బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్‌(పై రామ్మోహన్‌ నాయుడు విజయం సాధించారు. మూడోసారి విజయమే లక్ష్యంగా రామ్మోమన్‌ నాయుడు బరిలోకి దిగుతుండగా, వైసీపీ నుంచి బలమైన అభ్యర్థిగా పేరాడ తిలక్‌ను బరిలోకి దించుతున్నారు. ఇక్కడ పోటీ ఆసక్తిని కలిగిస్తోంది.
లోక్‌సభ అభ్యర్థులు  
నియోజకవర్గం వైసీపీ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)
శ్రీకాకుళం పేరాడ తిలక్‌ రామ్మోహన్‌ నాయుడు(టీడీపీ)
విజయనగరం పార్లమెంట్‌ స్థానం నుంచి సిటింగ్‌ ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్‌ను ఆ పార్టీ మరోసారి బరిలోకి దించుతోంది. టీడీపీ నుంచి కొత్త అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం కోసం తీవ్రస్థాయిలో పోటీ పడిన కలిశెట్టి అప్పలనాయుడిని ఎంపీగా నిలుపుతోంది. విశాఖపట్నం ఎంపీగా వైసీపీ బొత్స ఝాన్సీలక్ష్మిని బరిలో నిలిపింది. గతంలో విజయనగరం నుంచి రెండుసార్లు పార్లమెంట్‌ స్థానానికి ఈమె ఎంపికయ్యారు. విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మాత్కుమిల్లి భరత్‌ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఈయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోసారి అధృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
నియోజకవర్గం వైసీపీ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)
విజయనగరం బెల్లాన చంద్రశేఖర్‌ కలిశెట్టి అప్పలనాయుడు(టీడీపీ)
విశాఖ బొత్స ఝాన్సీలక్ష్మి మాత్కుమిల్లి భరత్‌(టీడీపీ)
అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న బూడి ముత్యాలనాయుడును వైసీపీ బరిలో దించుతోంది. ఈయనపై కూటమిగా అభ్యర్థిగా బీజేపీ నుంచి సీఎం రమేష్‌ పోటీ చేయబోతున్నారు. గతంలో సీఎం రమేష్‌ టీడీపీలో రాజ్యసభ ఎంపీగా పని చేశారు. అరకు ఎంపీగా శెట్టి తనూజరాణికి వైసీపీ అవకాశం కల్పించింది. కూటమిగా అభ్యర్థిగా బీజేపీకి చెందిన కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నారు. గతంలో ఈమె వైసీపీ నుంచి ఇదే స్థానంలో ఎంపీగా గెలిచి బీజేపీ గూటికి చేరారు. కాకినాడ ఎంపీ గా వైసీపీ నుంచి చలమశెట్టి సునీల్‌ పోటీ చేస్తున్నారు. గతంలో 2014లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. మరోసారి వైసీపీ ఈయనకు అవకాశం కల్పించింది. కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు.
నియోజకవర్గం వైసీపీ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)
అనకాపల్లి బూడి ముత్యాలనాయుడు సీఎం రమేష్‌(బీజేపీ)
అరకు శెట్టి తనూజరాణి కొత్తపల్లి గీత(బీజేపీ)
కాకినాడ చలమశెట్టి సునీల్ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌
అమలాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గంటి హరీష్‌ మాధుర్‌ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి పార్లమెంట్‌ స్థానానికి పోటీ పడుతున్నారు. రాజమండ్రి ఎంప  అభ్యర్థిగా వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాసరావు  పోటీ చేస్తున్నారు. తొలిసారి ఎంపీ స్థానానికి పోటీ పడుతున్న ఈయనపై కూటమి అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. గతంలో ఈమె విశాఖపట్నం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగాను పని చేశారు. వీరి మధ్య పోటీ ఆసక్తిని రేపుతోంది.
నియోజకవర్గం వైసీపీ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)
అమలాపురం రాపాక వరప్రసాదరావు గంటి హరీష్‌ మాధుర్‌ (టీడీపీ)
రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు పురందేశ్వరి(బీజేపీ)
నరసాపురం ఎంపీ  అభ్యర్థిగా వైసీపీ గూడూరు ఉమా బాలను బరిలోకి దించింది. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ పోటీ చేస్తున్నారు. ఏలూరునుంచి వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఈయనపై కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన పుట్టా మహేష్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి పార్లమెంట్‌ స్థానానికి పోటీ పడుతున్నారు. మచిలీపట్నం  నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి బరిలోకి దిగుతున్నారు. ఈయన గతంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.
నియోజకవర్గం వైసీపీ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)
నరసాపురం ఉమా బాల భూపతిరాజు శ్రీనివాస వర్మ (బీజేపీ)
ఏలూరు కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్‌ పుట్టా మహేష్‌ యాదవ్‌ (టీడీపీ)
మచిలీపట్నం డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ వల్లభనేని బాలశౌరి(జనసేన)
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎంపీ కేశినాని నాని  బరిలోకి దిగుతున్నారు. గతంలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఈయన మూడోసారి విజయాన్ని దక్కించుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈసారి అధికారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నాని సోదరుడు కేశినేని శివనాథ్‌(చిన్ని) పోటీ చేస్తున్నారు. గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా కిలారి వెంకట రోశయ్య పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌  బరిలోకి దిగుతున్నారు. నరసారాపుపేట ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి సిటింగ్‌ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయాలు బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన ఈయన.. ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌  పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది.
నియోజకవర్గం వైసీపీ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)
విజయవాడ కేశినాని నాని కేశినేని శివనాథ్‌(టీడీపీ)
గుంటూరు కిలారి వెంకట రోశయ్య పెమ్మసాని చంద్రశేఖర్‌(టీడీపీ)
నరసారాపుపేట అనిల్‌ కుమార్‌ యాదవ్‌ లావు శ్రీకృష్ణదేవరాయాలు(టీడీపీ)
బాపట్ల ఎంపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎంపీ నందిగాం సురేష్‌ను వైసీపీ మరోసారి బరిలోకి దించుతుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి టి కృష్ణ ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. నెల్లూరు ఎంపీ స్థానం ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఇక్కడ ఇద్దరు పెద్ద రెడ్లు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ, వైసీపీలో నెంబర్‌-2గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి నుంచి మొన్నటి వరకు వైసీపీలో ఉండి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు.
నియోజకవర్గం వైసీపీ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)
బాపట్ల నందిగాం సురేష్‌ టి కృష్ణ ప్రసాద్‌(టీడీపీ)
నెల్లూరు విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి(టీడీపీ)
ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బరిలోకి దిగుతుండగా, వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మద్దిల గురుమూర్తి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి వరప్రసాదరావుపోటీ చేస్తున్నారు. చిత్తూరు నుంచి సిటింగ్‌ ఎంపీ ఎన్‌ రెడ్డప్పను వైసీపీ బరిలోకి దించుతుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన దగ్గుమళ్ల ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. రాజంపేట ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్‌ రెడ్డి మూడోసారి విజయంపై కన్నేశారు. కూటమి అభ్యర్థిగా బీజేపీ నుచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు.
నియోజకవర్గం వైసీపీ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)
ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మాగుంట శ్రీనివాసులరెడ్డి(టీడీపీ)
తిరుపతి మద్దిల గురుమూర్తి వరప్రసాదరావు(బీజేపీ)
చిత్తూరు ఎన్‌ రెడ్డప్పను దగ్గుమళ్ల ప్రసాదరావు(టీడీపీ)
కడప పార్లమెంట్‌ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి విజయాన్ని దక్కించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన చడిపిరాళ్ల భూపేష్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. కర్నూలు  నుంచి వైసీపీ అభ్యర్థిగా బీవై రామయ్యపోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన బస్తిపాటి నాగరాజు(పంచలింగాల నాగరాజు)పోటీకి చేయబోతున్నారు. నంద్యాల పార్లమెంట్‌ స్థానానికి వైసీపీ నుంచి పోచం బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి బైరెడ్డి శబరి పోటీ చేయబోతోంది. హిందూపూర్‌ ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి శాంతి జొలదల పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథ్ పోటీ చేస్తున్నారు. అనంతపురం ఎంపీస్థానానికి వైసీపీ నుంచి నల్లగొండ్ల శంకర నారాయణపోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి అంబికా లక్ష్మినారాయణ పోటీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ ఈసారి ఆసక్తిని రేపుతోంది.
నియోజకవర్గం వైసీపీ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)
కడప వైఎస్‌ అవినాష్‌ రెడ్డి చడిపిరాళ్ల భూపేష్‌రెడ్డి (టీడీపీ)
కర్నూలు బీవై రామయ్య బస్తిపాటి నాగరాజు(టీడీపీ)
నంద్యాల
పోచం బ్రహ్మానందరెడ్డి బైరెడ్డి శబరి(టీడీపీ)
హిందూపూర్‌
శాంతి జొలదల బీకే పార్థ సారథి(టీడీపీ)
అనంతపురం నల్లగొండ్ల శంకర నారాయణ అంబికా లక్ష్మినారాయణ(టీడీపీ)

Related Posts