నెల్లూరు
మాజీ మంత్రి తెలుగుదేశం,జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి పొంగూరు నారాయణ ని సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించండి, ఈ ప్రాంతంలో ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి అభివృద్ధిని సాధించిన నారాయణ కి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నెల్లూరు ని స్మార్ట్ సిటీ గా చేసేందుకు సహకరించండి అంటూ అయన సతీమణి రమాదేవి ప్రచారం చేసారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,5వ డివిజన్ నాయకుడు రవి మరియు స్థానిక తెలుగుదేశం,జనసేన కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గోన్నారు.