YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు

ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు

తిరుపతి
కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్  మీడియాతో మాట్లాడారు. దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇండియాకూటమి అధికారం లోకి వస్తుంది. 350 సీట్లకు పైగా కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది. కేంద్రంలో బిజెపి పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. 10 ఏళ్ల బిజెపి పాలనలో  ప్రజలు విసిగు చెందారు.  మోడీ నాయకత్వంలో అదాని ,అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే  బిజెపి ప్రభుత్వం వల్ల లాభపడ్డాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల  జీవనం దుర్భరంగా మారింది. అన్ని రకాల నిత్యవసర ధరలు పెరిగాయి.  బిజెపి, ఎన్ డి ఏ కూటమి 150 సీట్లకే పరిమితం అవుతుంది. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  వచ్చింది. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో 120 సీట్లుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థుల స్కాలర్షిప్లు రెట్టింపు చేస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది.  దేశంలోనూ, రాష్ట్రంలోనూ   ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో కాంగ్రెస్ ఐ కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు

Related Posts