కర్నూలు, ఏప్రిల్ 12
కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. మూడు నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నలుగురు నేతలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. డోన్, పత్తికొండ టికెట్ ఆశించిన కేఈ ప్రభాకర్.. మంత్రాలయం టికెట్ ఆశించిన తిక్కారెడ్డితో పాటు ఆలూరు టికెట్ ఆశించిన వైకుంఠం మల్లికార్జున చౌదరి, పత్తికొండ టికెట్ ఆశావహురాలు మసాలా పద్మజ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది.
పార్టీ అధినేత చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదని నేతల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో ఈ నలుగురు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని తిక్కారెడ్డిపై కేడర్ ఒత్తిడి చేస్తోంది. దీంతో రెండు మూడు రోజుల్లో తిక్కారెడ్డి కార్యచరణ ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటికే కేఈ ప్రభాకర్ వైసీపీ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.కర్నూలు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మంత్రాలయం, ఆలూరు, ఆదోనీ, కర్నూలులో అసంతృప్తి భగ్గుమంది. మాజీ ఎమ్మెల్సీలు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. మంత్రాలయం నియోజకవర్గంలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జి తిక్కారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదేళ్ల పాటు తాను నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నానని, తాను గెలిచే అవకాశం ఉన్నప్పటికీ టీడీపీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుతిక్కారెడ్డి కచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కేడర్ తీవ్రమైన ఒత్తిడి చేస్తోంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో తాను, తన కుటుంబ సభ్యులు పోటీ చేయాలని తిక్కారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ తనను మోసం చేసిందని, చంద్రబాబు తనను కనీసం పట్టించుకోలేదని తిక్కారెడ్డి ఆవేదన చెందుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో మసాల పద్మజా టీడీపీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. మసాల పద్మజా ఎమ్మెల్సీగా పని చేశారు, టీడీపీ నేతగా ఉన్నారు. ఇక ఆదోనీ నియోజకర్గంలోనూ అదే అసంతృప్తి నెలకొని ఉంది.