YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కవితక్కకు కష్టాలేనా

కవితక్కకు కష్టాలేనా

హైదరాబాద్, ఏప్రిల్ 12,
కల్వకుంట్ల కవిత ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటపడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఇది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఒకవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ కూడా కేసు నమోదు చేయడంతో ఇక కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవన్నది మాత్రం న్యాయనిపుణుల అభిప్రాయంగా వినిపిస్తుంది. కవితను బలమైన సెక్షన్లతో ఫిక్స్ చేస్తున్నారన్న ఒపీనియన్ ను లీగల్ ఎక్స్‌పర్ట్స్ ద్వారా తెలుస్తుంది. కవితక్కకు మున్ముందు కష్టాలే తప్ప బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు. ఇప్పటికే నెల రోజుల నుంచి... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15వ తేదీన హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను పది రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ ను విధించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌ ముగియడంతో తిరిగి కోర్టుకు తీసుకురాగా మరొకసారి ఆమెకు ఈ కేసులో కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ కు విధించింది. ఈ నెల 23వ తేదీ వరకూ కవిత తీహార్ జైలులోనే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండనున్నారు. ఇదిలా ఉండగానే కవిత విషయంలో సీబీఐ ఎంటరైంది. సీబీఐ కూడా ఇదే కేసులో కవితపై కేసు నమోదు చేసింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. మళ్లీ సీబీఐ కేసును కవితను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే కవిత తరుపున న్యాయవాదులు న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఆమెతరుపున లాయర్ మోహిత్ రావు కవితను సీీబీఐ అరెస్ట్ చేయడంపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. జైల్లో ఉన్న కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన పిటీషన్ లో ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను అరెస్ట్ చేశారని ఆయన వాదించారు. దీంతో ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని, ఈ కేసు గురించి తనకు తెలియదని న్యాయమూర్తి మనోజ్ తెలిపారు. రేపు ఉదయం రెగ్యులర్ కోర్టులో పిటీషన్ వేయాలని కోరారు. దీంతో రేపటి విచారణలో ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. న్యాయవాదుల అభిప్రాయం మేరకు కవితకు సీబీఐ కేసులో కూడా ఊరట లభించే

Related Posts