YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పోలీస్ కానిస్టేబుళ్ల బదిలీలకు లైన్ క్లియర్

పోలీస్ కానిస్టేబుళ్ల  బదిలీలకు లైన్ క్లియర్
డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీస్ శాఖ ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల వివరాలు సేకరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాత పోలీస్ స్టేషన్లు 73 ఉండగా.. కొత్తగా మరో 10పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయి. మొత్తం 83 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కోమురంభీం(ఆసిఫాబాద్) జి ల్లాలకు నలుగురు ఎస్పీలు ఉండగా.. వీటి పరిధిలో ఏఎస్పీలు ఐదుగురు, డీఎస్పీలు 14మంది, 64మంది సీఐలు, 207ఎస్సైలు, 276 ఏఎస్సైలు, 3260మంది కానిస్టేబుళ్లు, 1860హెడ్ కానిస్టేబుళ్లు, 160మంది మహిళా కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు.  5 వరకు దరఖాస్తుల స్వీకరణ, 6నుంచి 12 వరకు దరఖాస్తుల పరిశీలన, 13 నుంచి 12 వరకు ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని పోలీసులకు ఊరటనిచ్చింది.ఒకే చోట ఐదే ళ్లు పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, నాలుగేళ్లు పూర్తి చేసిన హెడ్‌కానిస్టేబుళ్లు, మూడేళ్లు పూర్తి చేసిన ఏఎస్సైలతో పాటు ఆర్డర్ టు సర్వ్ ద్వారా బదిలీలైన వారందరికీ బదిలీలు చేయాలని రాష్ట్ర డీజీపీ పోలీసు శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్న పోలీసుల వివరాలను అందజేయాలని నాలుగు జిల్లాల పోలీసు కార్యాలయాలకు ఎస్పీ విష్ణువారియర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. వివిధ పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు ప్రొఫార్మాను పూరించి కోరుకున్న చోట ఆన్‌లైన్‌లో దరఖాస్తును చేసుకోవాల్సి ఉంటుంది.జిల్లాల పునర్విభజన తర్వాత ఆర్డర్ టూ సర్వ్ ద్వారా పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక చోట కుటుంబం మరో చోట ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తుండగా.. పోలీసు బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలోని పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్వపు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న వారి నుంచి బదిలీల కోసం పోలీస్ స్టేషన్‌ల వారీగా కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు ఎన్నో ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు ఆ వివరాలను సేకరిస్తున్నారు. పోలీసులు ఆన్‌లైన్‌లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ముందుగా పదవీ విరమణకు దగ్గరున్న వారికి మొదట ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. మిగతా పోలీసులకు పూర్వపు జిల్లా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలను చేయనున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న 980 మంది హోంగార్డులకు సైతం త్వరలో బదిలీలు కానున్నాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Related Posts