YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

శ్రీరామ శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన అధికారులు

శ్రీరామ శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన అధికారులు

హైదరాబాద్
ఈనెల 17న జరగబోయే శ్రీరామ శోభాయాత్ర మార్గాన్ని  నగర సిపి శ్రీనివాస్ రెడ్డి,పోలిస్ ఉన్నతాధికారులు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు,శోభాయాత్ర నిర్వాహకులు సందర్శించారు. శోభయాత్రలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను నిర్వాహకులకు సిపి సూచించారు.
సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్ఆడుతూ శోభయాత్రని కులమతాలకు అతీతంగా జరుపుకోవాలి. శోభయాత్రలో ఇతర మతస్థులను కించపరిచే,పాటలు గాని,ప్రసంగాలు గాని చేయకూడదు. శోభయాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్నీజాగ్రతలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు. శోభాయాత్ర సీతారాం బాగ్ ద్రౌపతి గార్డెన్ నుండి ప్రారంభం అవుతుంది. మంగళ్ హట్, దబిల్పూరా, పురాణపుల్, జు మ్మరత్ బజార్, బేగంబజార్ చెత్రి, గోల్మాజిత్, గౌలిగూడా, కుత్లిబౌలి, కోఠి ఆంధ్రా బాంక్, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయమ శాల వరకు కొనసాగుతుంది. శోభయాత్ర అనుకున్న సమయంలో ప్రారంభించి తొందరగా ముగించడానికి నిర్వాహకులు సహకరించాలి. శోభయాత్రలో భక్తి కీర్తనలతో కూడిన పాటలు మాత్రమే ప్లే చేసి యాత్రను దిగ్విజయంగా కొనసాగించాలని అయన విజ్ఞప్తి చేసారు.

Related Posts