YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రిపొన్నం పై మండిపడ్డ బండి సంజయ్

మంత్రిపొన్నం పై మండిపడ్డ బండి సంజయ్

కరీంనగర్
మంత్రి పొన్నం ప్రభాకర్ ,మాజీ ఎంపీ వినోద్ కుమార్ లపై  ఎంపి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేసారు. పొన్నం... మీ పార్టీ మాట తప్పినందుకు, గాంధీభవన్ వద్ద దీక్ష చేయ్.. కేసీఆర్ 10 ఏళ్లపాటు అరిగోసప పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయ్. 80 కోట్ల మంది పేదలకు మోదీ అన్నం పెడుతున్నందుకు.. కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? కేసీఆర్ పాలనలో అన్న వర్గాలను దగా చేసినప్పుడు ఒక్కనాడు కూడా దీక్ష ఎందుకు చేయలేదని అన్నారు. వడ్ల కుప్పలపై రైతులు గుండెపగలి చస్తుంటే... ఎందుకు దీక్ష చేయలేదు. వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చిన తరువాతే కొనుగోలు చేయాల్సిందే. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస ధరకు వడ్లను కొంటారా? లేదా? పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష జరపడం లేదు? బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలుపై అరిగోస పడ్డ రైతులకు అండగా నిలిచింది మేమే ప్రధాని అభ్యర్ధి తెలియని కూటమికి ఎలా ఓటేస్తారు? నిధులు తెచ్చి అభివ్రుద్ధి నేను చేస్తుంటే... మీరు  ప్రచారం చేసుకుంటారా? అభ్యర్ధే దొరకని కాంగ్రెస్, అపర మేధావి కలిసి నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.

Related Posts