YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రామాల్లో పంచాయితీ సందడి

 గ్రామాల్లో పంచాయితీ సందడి
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది.ఎక్కడ ఏవీధీలో చూసినా పంచాయతీ సందడి ముచ్చట్లే. ఈ సారి ఎలాగైనా పంచాయతీలో పాగా వేయాలంటూ యువకులు ఒకడుగు ముందుకువేసి మరీ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యం గా కొంత మంది యువకులైతే పంచాయతీ బరిలో నిలిచేందు కోసం హైదరాబాద్, ముం బాయి, నాందేడ్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తు స్థిరపడ్డా తమ స్వగ్రామంలో కచ్చితంగా ఈ ఎన్నికల్లో నిలబడి ప్రజాసేవ చే యాలనే కుతూహలంతో గ్రామాలకు వచ్చి చేరారు. కొత్తవారు యువకులు గ్రామాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో గతంలో రిజర్వేషన్‌లు అ నుకూలించక స్తంబ్దంగా ఉన్న సీనియర్లు వచ్చేసారైనా పోటీలో ఉండి పదవిని చేజిక్కించు కోవాలనే పట్టదలతో ఉన్నారు.కొత్తవారు ఎం ట్రీ ఇవ్వడంతో పాత నాయకులు కుడితిలో పడ్డ ఎలుకల్లా ఎం చేయాలో ఎలా ప్రచారం చేయాలో తర్జనబర్జన పడుతున్నారు. కొత్తగా వచ్చి చేరిన యువకుల ప్రచారాలకు పాతవా రు తట్టుకోలేక పోతున్నారు. పది పంచాయతీలతో ఏర్పడ్డ మండలం నూతనంగా మరో నాలుగు కొత్త పంచాయతీలు ఏర్పడడంతో ఆ సంఖ్య 14కు చేరుకుంది. నూతనంగా ఏర్పాటైన పంచాయతీలు రాంపూర్, నగరం, జెడ్‌చెరువు, నందగోకులం పంచాయతీలలో హైదరాబాద్‌లో ఉన్న యువకులు గ్రామాలకు వచ్చి ప్రతిరోజు రచ్చబండలపై మీటింగులు పెట్టి నేనంటే నేనంటూ బేరసారాలు సాగిస్తున్నారు. రాంపూర్ గ్రామంలో ఎలాంటి బేరసారాలు లేకుండా ఊరంతా ఉమ్మడిగా అభ్యర్తిని నిలిపి ప్రభుత్వం గ్రామాభివృద్ధ్దికి ఇచ్చే రూ.5లక్షలకు సిద్ధ్దంగా ఉంది. ఈ విషయం స్థానిక నాయకుల చెవిలో వేసినట్లు కూడా తెలిసింది. మరో మూడు గ్రామాలైన నగరం, నందగోకులం, జెడ్‌చెర్వు గ్రామాలు ఈ మూ డు గ్రామాల్లో ఓటర్లు కూడా 500లోపే ఉన్నారు. అయినా ఆ ఊర్లలోని రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. పట్నంలో ఉన్న యువకులు గ్రామాలకు చేరి నేను, పది లక్షలు ఇస్తానంటే మరొక నాయకుడు వచ్చి నేను అంతకంటే ఎక్కువ ఇస్తానంటూ ప్రతిరోజు చర్చలు కొనసాగిస్తున్నారు. ఇది ఇలాగుంటే ప్రభుత్వం ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఇస్తుండడంతో వార్డు సభ్యులకు కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో వార్డు సభ్యుడిగా గెలవాలంటే డబ్బులు ఖర్చవుతాయి.ఆ డబ్బులను కూడా ఉప సర్పంచ్‌గా నిలబడే వ్యక్తులు వార్డు సభ్యులను గెలిపించుకునేందు కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇదిఇలాఉంటే పెద్ద పంచాయతీలు కల్వకుంట, నార్లాపూర్,నిజాంపేట, చల్మెడ, వెంకటాపూర్ కే, నందిగామ, బచ్చరాజునపల్లె, తిప్పనగుల్ల, రజాక్‌పల్లి, నస్కల్ గ్రామాలలో కూడా ఈ సారి పోటీ ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. రిజర్వేషన్‌లు ఇంకా రాకపోవడంతో వార్డులలోనే తిరుగుతూ మహిళలను, పురుషులను ఇద్దరిద్దరు చొప్పున ఎంపిక చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. రిజర్వేషన్‌లు రాకముందే ఇంత హడావుడి ఉంటే మరి రిజర్వేషన్‌లు ఖరారైతే ఇంకెంత హడావుడి ఉంటుందోనని కొంతమంది ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారో గెలుపోటములు ఎలాగుంటాయే చూడాలిమరి.

Related Posts