YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ సెల్ఫీ పాయింట్ ను సిఈసీ ముఖేష్ కుమార్ మీనా

స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ సెల్ఫీ పాయింట్ ను సిఈసీ ముఖేష్ కుమార్ మీనా

తిరుపతి,
ఎన్నికల ముందస్తు తనిఖీలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్శిటీలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింటు ను, కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్, జేసి ధ్యానచంద్ర, మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ తదితరులతో కలిసి ప్రారంభించి, సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగి, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా జరిగేలా అన్ని విధాలా ఎన్నికల మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.
శుక్రవారం ఉదయం ఆం.ప్ర రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సెల్ఫీ పాయింట్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్,ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్, జేసీ ధ్యాన చంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి రిజిస్ట్రార్ రజని లతో కలిసి ప్రారంభించి అక్కడి  విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులతో, అధికారులతో ఓటు విలువ ప్రాముఖ్యతను వివరించేలా ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అని పలు నినాదాలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోల్ అయిన ఈవిఎం లను భద్రపరచు స్ట్రాంగ్  రూం లను, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా  రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఏప్రిల్18వ తేదీన రాష్ట్రంలో 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నదని, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 25 తో ముగుస్తుందని,మే 13 న  ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఎన్నికలు జరగడానికి ముందు జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు పనితీరు, ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు కంట్రోల్ రూమ్ పనితీరు, ఎస్ఎస్ఎస్టీ ల ఏర్పాటు,  గ్రీవెన్స్ లను ఎలా పరిష్కరిస్తున్నారో చూడడానికి తనిఖీలు నిర్వహిస్తున్నానని ఇందులో  భాగంగా ప్రకాశం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్, బోర్డర్ సెక్యూరిటీలు, నెల్లూరు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్, కంట్రోల్ రూం నిర్వహణను పరిశీలించడం జరిగిందనీ, తిరుపతి జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు కౌంటింగ్, స్ట్రాంగ్ రూం లను పరిశీలించడం జరుగుతుందని, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన స్వీప్ సెల్ఫీ పాయింటు ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. స్వీప్ యాక్టివిటీలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు మరియు పౌరురాలు ఓటరుగా నమోదు చేయించుకోవాలని, మరియు పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రం వచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు నెలల క్రిందట డ్రాఫ్ట్ రోల్ ప్రచురించ బడినప్పుడు కొత్తగా నమోదైన ఓటర్లు కేవలం 3లక్షల  మాత్రమే ఉండేవని, అయితే ఎలక్షన్ కమిషన్ మరియు జిల్లాలోని కలెక్టర్లు, అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా ఆ సంఖ్య 10 లక్షల వరకు చేరుకుందని, ఈ సంఖ్య కేవలం 18 ఏళ్లు నిండిన వారివని, ఓటరుగా నమోదు చేసుకొనుటకు ఇంకను రెండు రోజులు అవకాశం ఉందని అన్నారు. 35 వేల ఎపిక్ కార్డులు అన్ఆతరైజ్డ్ గా డౌన్లోడ్ చేశారని అభియోగాలపై మీడియా వారు అడుగగా ఐఎఎస్ అధికారి మొదలుకొని మండల స్థాయి వరకు అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందని,  కేసు విచారణలో ఉందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు ఓటర్లు ప్రభావితం కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే అట్టి వారిపై చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్లను, ఎస్.పి లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.  ఎంతటి ప్రధాన పార్టీ అయిన ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే అట్టివారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మతపరంగా అప్పీల్ చేయరాదని, నిజనిర్ధారణ లేని ఆరోపణలు చేయరాదనీ, దేశ భద్రత భంగం కలిగించేవి ఉండరాదని,పలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు లేకుండా రాజకీయ పార్టీలు నడుచుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రికి మరియు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఎంతటి వారైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన ఉద్యోగులపై గతంలో ఎన్నడూ లేనంతగా సస్పెండ్ చేయడం జరిగిందని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు రూ. 8 కోట్ల విలువ పైన సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీకి సూచిస్తూ స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచల భద్రత ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, బలగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోల్ అయిన ఈవీఎంల సీసీ కెమెరా పర్యవేక్షణ, సాయుధ బలగాల బందోబస్తు ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తిరుపతి నిషాంత్ రెడ్డి, తాశిల్డార్లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు .

Related Posts