YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్..

ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్..

విజయవాడ, ఏప్రిల్ 13,
రాజకీయాల్లో బలం , బలగాన్ని కుటుంబాల ద్వారానే కూడగట్టుకున్న నేతలు ఉన్నారు. ఇలాంటి నేతలు ఏపీలో కాస్త ఎక్కువగా ఉన్నారు  ఒక్కో కుటుంబం నుంచి నలుగురు, ఐదుగురు పోటీ చేస్తున్నారు. విచిత్రం ఏమటంటే.. వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు కూడా ఉన్నారు. పార్టీలు చేతుల్లో ఉన్న కుటుంబాల సంగతి చెప్పాల్సిన పని లేదు.కుటుంబానికి ఒక్కటే సీటు అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టిక్కెట్ల కసరత్తు సమయంలో ప్రకటించారు. కానీ ఈ నిబంధన అన్ని కుటుంబాలకు వర్తింప చేయలేదు. టిక్కెట్ ఇవ్వకూడదనుకున్నవారికి.. ఇవ్వడం కుదరని వారికే వర్తింప చేశారు.  స్వయంగా చంద్రబాబు కుటుంబం నంచే పలువురు పోటీ చే్సతున్నారు. చంద్రబాబునాయుడు  కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం, ఆయన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బాలకృష్ణ చిన్న అల్లుడు, ఎం భరత్‌ విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. నందమూరి, నారా కుటుంబాలతో బంధుత్వం ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి లోక్‌సభ నుంచి బిజెపి తరపున పోటీలో ఉన్నారు.మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె తణుకు నుంచి పోటీ చేస్తుండగా, ఆయన చిన్నల్లుడు ఏలూరు పార్లమెంటు నుంచి బరిలో ఉన్నారు. ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కడప జిల్లా మైదుకూరు నుంచి బరిలోకి దిగారు.  ప్రస్తుతం టిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, ఆయన అన్న ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. రామ్మోహన్‌నాయుడు సోదరి భర్త ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల వైసిపి నుంచి టిడిపిలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కుటుంబం రెండు చోట్ల పోటీకి దిగారు. నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఆయన పోటీ చేస్తుండగా, ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి కొవ్వూరు నుంచి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.  నెల్లూరు సిటీ నుంచి మాజీమంత్రి పి నారాయణ బరిలో ఉండగా విశాఖపట్నం భీమిలి నుంచి ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల శాసనసభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన బాబాయి కొడుకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కడప లోక్‌సభ నుంచి, ఆయన మేనమామ రవీంద్రనాథ రెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.  జగన్‌ కుటుంబంతోనే బంధుత్వం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారు.  మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి వైసిపిలో నాలుగు టికెట్లు దక్కాయి. చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేస్తుండగా, ఆయన భార్య బొత్స ఝాన్సీ విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి, సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం నుంచి, తమ్ముడు వరుసైన అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైసిపి తరపున నామినేషన్ వేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ నరసన్నపేట నుంచి పోటీ చేయనున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మూడు టికెట్లు దక్కాయి. పుంగనూరు నుంచి ఆయనకు తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి, రాజంపేట లోక్‌సభ నుంచి ఆయన కొడుకు ఎంపి మిథున్‌ రెడ్డి బరిలోకి దిగనున్నారు.   కర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబానికి, చిత్తూరులో చెవిరెడ్డి కుటుంబానికి, నెల్లూరులో మేకపాటి కుటుంబానికి, గుంటూరు జిల్లాలో అంబటి కుటుంబానికి రెండు టికెట్లు చొప్పున దక్కాయి. శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడి కుమారుడు శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి బరిలో ఉన్నారు. చంద్రగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఈసారి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీలో ఉండగా, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి చంద్రగిరి నుంచి బరిలోకి దిగనున్నారు. మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి ఉదయగిరి నుంచి, ఆయన కుమారుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆత్మకూరు నుంచి బరిలో దిగనున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే జిల్లా పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా రాంబాబు సోదరుడు అంబటి మురళి పోటీ  చేస్తున్నారు.    మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో పాటు ఆయన సోదరులు ఇద్దరు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.    

Related Posts