YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట

మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట

శ్రీకాకుళం
చంద్రబాబుది కుటిల బుద్ధి అని, ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని శ్రీకాకుళం వైసిపి అసెంబ్లీ అభ్యర్థి,  రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్టార్ వాకర్స్ క్లబ్ మరియు క్రీడాకారులతో ఆత్మీయ సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మరో మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా విశాఖ రాజధాని పైనే దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. రాజధానిపై తెలుగుదేశం పార్టీ స్టాండ్స్ ఏదో చెప్పగలరా అని ప్రశ్నించారు.  టీడీపీ నేతలు అచ్చంనాయుడు గాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు గాని కూన రవి కుమార్ గాని  వారి స్టాండ్స్ చెప్పగలరా అని ప్రశ్నించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ఇంకా వెనుక పడిపోవాలని చంద్రబాబు నాయుడు తాలూకా కుట్ర అని పేర్కొన్నారు. 1983 నుంచి టిడిపికి కంచుకోటగా ఉన్న జిల్లాకు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా కేటాయించ పోయినా జిల్లాలోని టిడిపి నాయకులు ఎందుకు నోరెత్తలేదని ద్వజమెత్తారు. మా ప్రాంత సమస్యలపై మేము గొంతు ఎత్తితే మేము దుర్మార్గలం అంటూ చెబుతారు మా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న మీరే   పరమ దుర్మార్గులని పేర్కొన్నారు.  కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని కూలదోసింది టిడిపి కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు ఎన్నికలు యావ తప్ప ప్రజా సంక్షేమం పట్టదని చెప్పారు. హైదరాబాదులో నివాసమున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులపై మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. శ్రీకాకుళంలో అభివృద్ధి గురించి మేము ఎక్కడైనా చెప్పగలము మీరు ఒక్క శాశ్వత అభివృద్ధి అయినా చేసామని చెప్పుకునే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. త్వరలోనే  ఆమదాలవలస నుండి  శ్రీకాకుళం వొచ్చే రోడ్డు కూడా పూర్తవుతుందని చెప్పారు.  మూలపేట పోర్ట్ నిర్మాణంతో సిక్కోలు జిల్లా రూపం మారుతుందని తద్వారా  ప్రపంచంతో అనుసంధానం అవుతుందని అన్నారు.

Related Posts