YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జోరుగా సాగుతున్న పోలవరం మట్టిపని

జోరుగా సాగుతున్న పోలవరం మట్టిపని
బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు మట్టిపని జోరుగా సాగుతోంది. జూన్‌లోపు నిర్దేశిత మట్టి పని పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు జరుగుతున్న క్రమంలో అడ్డుకట్టలు వేసి, మట్టి పనులు పూర్తిచేస్తున్నారు. పోలవరం పవర్‌హౌస్‌కు సంబంధించి ఎర్త్‌వర్కు గడువులోగా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కాంక్రీటు పనికి మరో ఆరు నెలల గడువు పొడిగించారు. పవర్‌హౌస్‌కు సంబంధించి ఆగస్టు వరకు మట్టిపని పూర్తయ్యే పరిస్థితి కన్పించడంలేదు. దీంతో కాంక్రీటు పనిని మరో ఆరు నెలలు పొడిగించారు. ప్రస్తుతం పవర్‌హౌస్‌కు సంబంధించి కొండ తొలగించే మట్టిపని జరుగుతోంది. స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్, స్పిల్‌వే, లెఫ్ట్‌ప్లాంక్, అప్రోచ్ ఛానల్ పనులకు 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తిచేయాల్సి వుండగా, రోజుకు 1.57 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఇంకా 322.49 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరగాల్సివుంది. అయితే స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ప్లాంక్‌కు కలిపి 218.72 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాల్సివుంది. అప్రోచ్ ఛానల్‌కు 101.48 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరగాల్సివుంది. మొత్తం 320.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని చేయడానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక కాంక్రీటు పనికి సంబంధించి స్పిల్‌వేకు 11.95 లక్షల క్యూబిక్ మీటర్లు జరగాల్సివుంది. ఇందులో 2.43 లక్షల క్యూబిక్ మీటర్లు ట్రాన్స్‌స్ట్రాయ్, 1.44 లక్షల క్యూబిక్ మీటర్లు నవయుగ కలిపి 3.87 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటుపని జరుగుతోంది. స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 1.27 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతోంది. ఇంకా 3.17 క్యూబిక్ మీటర్ల కాంక్రీటుపని చేయాల్సివుంది. స్పిల్ ఛానల్‌కు సంబంధించి 18.75 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సివుంది. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ కలిపి ఇంకా 30.00 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సివుంది.డయాఫ్రమ్ వాల్‌కు సంబంధించి 400 పానెల్స్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకు 314 పానెల్స్ పూర్తయ్యాయి. కాఫర్‌డ్యామ్ జెట్‌గ్రౌటింగ్ పనులు జరుగుతున్నాయి. దిగువ కాఫర్ డ్యామ్ కాలమ్స్‌కు సంబంధించి 733 మీటర్లు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. 1098 మీటర్ల మేర పొడవు పూర్తయింది. ఎగువ కాఫర్ డ్యామ్‌కు 400 మీటర్ల వరకు నది ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. మార్చి చివరి నుంచి నదీ ప్రవాహాన్ని మళ్ళించారు. ఎగువ కాఫర్ డ్యామ్ కాలమ్స్‌లో 678 మీటర్లు, 1017 మీటర్ల పొడవు పూర్తయింది. హైడ్రాలిక్ గేట్లకు సంబంధించి సిలిండర్స్‌కు డిజైన్లు సీడబ్ల్యుసీ ఖరారు చేయాల్సి వుంది. అదేవిధంగా ఎంబెడెడ్ పార్టుల్లో 48 వెంట్లకు, స్టాప్‌లోగ్ ఎలిమెంట్స్ ఐదు సెట్లకు డిజైన్లను సీడబ్ల్యూసీ వద్ద పరిశీలనలో ఉన్నాయి. రివర్ స్లూరుూస్ గేట్లలో గేట్ లీఫ్‌లలో 10 సెట్లకు సీడబ్ల్యుసీ డ్రాయింగ్స్‌కు ఆమోదం పొందాయి. అదేవిధంగా హైడ్రాలిక్ హోయిస్ట్‌లో 10 సెట్లకు సీడబ్ల్యుసీ డ్రాయింగ్‌లు అనుమతించింది. మొత్తం మీద హెడ్ వర్క్సు మట్టి పనులు నిర్దేశిత లక్ష్యం మేరకు వేగంగా జరుగుతున్నాయి.

Related Posts