YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మేనత్తపై షర్మిల సంచలన వ్యాఖ్యాలు

మేనత్తపై షర్మిల సంచలన వ్యాఖ్యాలు

కడప
మేనత్త వైఎస్ విమలారెడ్డి పై ఏపీసీసీ ఛీఫ్, కడప ఎంపి అభ్యర్ది షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
షర్మిలా మాట్లాడుతూ విమలమ్మ మాకు మేనత్త. మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు. సిబిఐ  చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామని అన్నారు.
ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది.  అందుకే మేము మాట్లాడుతున్నాం.  ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం.  హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నాం. విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారు.  ఆర్థికంగా బల పడ్డారు. అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు.  ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలి.  వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయింది.  విమలమ్మ కి వయసు మీద పడింది.  అందులో ఎండా కాలం.  అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుందని అన్నారు.

Related Posts