విజయవాడ
వైకాపాకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలు తొలగించారు. ఎంసిసి పర్యవేక్షణ అధికారి రహీం నేతృత్వంలో తాడేపల్లి, విజయవాడ మధ్య కృష్ణా వారధి పై ఏర్పాటు చేసిన జెండాలు తొలగించారు. వారధి రెండు వైపులా ఏర్పాటు చేసిన బ్యానర్లు తాడేపల్లి మున్సిపల్ సిబ్బంది తొలగించారు. వారధి వద్ద స్వాగత ఏర్పాట్లును కుడా ఎన్నికల సంఘం అధికారులు తొలగించారు.