వివిధ రంగాలలో నిష్ణాతులైన దాదాపు 40 మంది కళాకారులు, విద్యావేత్తలు, వైద్యరంగ నిపుణులు, సినీ ప్రముఖులు తదితరులకు *'విశ్వగురు వర్ల్డ్ రికార్డ్స్'* సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ సిఈఓ *'సత్యవోలు రాంబాబు'* అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి *గౌ॥ శ్రీమతి జస్టిస్ పెరుగు శ్రీసుధ గారు* ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీతలను, అవార్డులందించిన విశ్వగురు వర్ల్డ్ రికార్డ్స్ సంస్థను అభినందించారు. ఈ సందర్భంగా ఉగాది పండుగ గురించి మాట్లాడారు. బాగా పనిచేసే వారిని ఇంకా బాగా పనిచేసేలా ఈ అవార్డులు ప్రేరేపిస్తాయని ఈ సందర్భంగా న్యాయమూర్తి గారు పేర్కొన్నారు.
బేగంపేట టూరిజమ్ ప్లాజా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా మాజీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ పొన్నూరు మదన్ మోహన్ మరియు మానవతావాది, పారిశ్రామిక వేత్త, ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి హాజరయ్యారు.
విశ్వగురు వర్ల్డ్ రికార్డ్స్ టీమ్ సభ్యులు రవిచరణ్, పూజిత, కిశోర్ కుమార్, డా॥ ఎమ్ఆర్ఎస్ రాజు, సారంగపాని, యాదయ్య, విజయకుమార్, కృష్ణాది శేషు తదితరులు పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతలు : సామజిక సేవలో బి. విజయ్ కుమార్, ఫిల్మ్ &టీవీ డైరెక్టర్, నిర్మాత, నంది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ samay హిందీ daily Editor మహ్మద్ షరీఫ్,ఫిల్మ్ journalist వినాయకరావు, లయన్ బి. వి. ఎస్. రావు, అచ్చివర్స్ కేటగిరీ లో డాక్టర్ NNV సుబ్బారావు, కోన శ్రీనివాస్ రావు, ఎం. ఎస్. విజయ్ కుమార్, భవాని, ఎంజరాపు రమణమ్మ, బండి శ్రీనివాస్ రఘు వీర్,క్రిష్ చింతాలూరి, వినోద్ కళారంగంలో గుదిబండి వెంకటరెడ్డి, రమణారెడ్డి తదితరులు ఉన్నారు.
Related Posts