ప్రభుత్వ పథకాలన్నింటిలోకీ తనకు ఎంతో సంతృప్తినిచ్చిన పథకం చంద్రన్న బీమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన... చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబుయ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన డ్రైవర్ల కుటుంబాలకు 11వ రోజే పరిహారాన్ని అందేలా ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ఈ పథకం సమగ్రంగా అమలవుతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇబ్బందులు వొచ్చిన సమయంలో ఆదుకునే మనస్సు ఉండాలి, చంద్రన్న బీమా ద్వారా మంచి పనితీరును చూపుతున్న భీమా మిత్రాల పనితీరును అభినందిస్తున్నానాని అన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ ఘటన నన్ను ఆలోచింప చేసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చెయ్యడం లో నా మానసిక పుత్రికలు ఐనా డ్వాక్రా మహిళలపై ఉన్న నమ్మకం , ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నామని అయనఅన్నారు. క్లెయిమ్ పరిష్కరించడం లో కాలపరిమితి తో కూడిన చెల్లింపులు పై చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. పెదవాళ్లకు అండగాఉండాలని ఇంటి వద్దకే పెన్షన్ అందించడం జరుగుతోంది . పూర్తి కూలి సొమ్ము అందించడం ద్వారా మే నెలలో రూ.1000 కోట్లు చెల్లించడం జరుగుతున్నది. ప్రజలకు అందుతున్న సేవలను మరింతగా పెంచే ఆలోచనలు తో వాటిపై ప్రజల అభిప్రాయం తెలుసుకుంటూ, వారికి భరోసా గా ప్రభుత్వం నిలవడం జరుగుతుందని అన్నారు. స్వశక్తి తో బతకడం కోసం కుటుంబ పెద్ద మరణించినా బీమా పథకం ద్వారా వొచ్చిన సొమ్ముతో చెల్లెళ్ళు యశోద 50 వవేలతో కిరాణా కొట్టు , నాగేశ్వరమ్మ రెండు కుట్టు మిషన్స్ తో కుటుంబ పోషణ చేసు కుంటు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం జోడించి పౌర సేవలను హలో చంద్రన్న అంటే ఆ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అయన అన్నారు. ఈడ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, మంత్రి కాలువ శ్రీనివాసులు, కనీస వేతనాల సలహా బోర్డ్ ఛైర్మన్ ఆర్.రామమోహన రావు, స్పెషల్ సీఎస్ జె ఎస్ వి ప్రసాద్, సెర్ప్ సీఈఓ పి.కృష్ణ మోహన్, కమిషనర్ డి.వరప్రసాద్, ఎల్ ఐ సి ప్రాంతీయ మేనేజర్ ఎం.జగన్నాధం, పలువురు లబ్ధిదారులు పాల్గోన్నారు.