YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హరితహారం ప్రపంచానికే ఆదర్శం: మంత్రి కేటీఆర్

హరితహారం ప్రపంచానికే ఆదర్శం: మంత్రి కేటీఆర్
హరితహారం కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఘట్‌కేసర్ మండలం పోచారంలోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ  పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హరితహారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉద్యోగులు ప్లాస్టిక్ వల్ల అనర్థాలను ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..3300 మెగావాట్లతో సౌర విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే తొలిస్థానంలో ఉన్నామని తెలిపారు. హైదరాబాద్‌లో త్వరలో 500ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. నగరంలోని అన్ని చెరువులను దశలవారీగా వాడకంలోకి తీసుకువస్తాం. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కైవే ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగిస్తున్నాం. చెన్నై వాతావరణంబెంగళూరు ట్రాఫిక్‌తో పోలిస్తే ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ ఎదుగుతోంది. వరంగల్‌లో ఇప్పటికే మహీంద్ సీయంట్ ఐటీ సంస్థలు ఉన్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతుమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీవోవో యుబీ ప్రవీణ్ రావ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related Posts