విజయవాడ, ఏప్రిల్ 18
ఎన్నికలకు ముందు సర్వేలు రావడం సహజం. పేరున్న సంస్థలతో పాటు కొన్ని ప్రయివేటు సంస్థలు కూడా సర్వేలు చేస్తుంటాయి. ప్రజల మూడ్ తెలుసుకోవడంతో పాటు ఆ నియోజకవర్గంలో ఓటర్లలో ఎక్కువ మంది ఎటువైపు మొగ్గు చూపుతారో ఒక అంచనాకు వస్తారు? ఏపీ ఎన్నికలను తీసుకుంటే ఏ సర్వే సంస్థ ఐదు కోట్ల మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించదు. అది ఎంత మాత్రం సాధ్యం కాదు కూడా. అందుకే ప్రతి సర్వే సంస్థ శాంపిల్ సర్వేలను మాత్రమే నిర్వహిస్తాయి. అంటే నియోజకవర్గానికి వందో.. వెయ్యో.. ఇలా.. ముందుగా నిర్ణయించుకుని ఆ ప్రాంతాలలో సర్వే చేయడం సర్వే సంస్థలు చేస్తుంటాయి. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని... అలాగే ప్రతి గ్రామంలో సర్వే చేయడం అనేదికూడా ఏ సంస్థకు సాధ్యం కాదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంచుకున్న గ్రామాలకే సర్వే సంస్థ ప్రతినిధులు వెళ్లి సర్వేలు చేస్తుంటాయి. ఇటీవల కాలంలో ఫోన్ల ద్వారా కూడా సర్వే సంస్థలు ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈసర్వే ఫలితాలు పెద్దగా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మెజారిటీ ప్రజాభిప్రాయాన్ని ఏ సంస్థ సేకరించలేదన్నది అందరికీ తెలిసిందే. కేవలం ప్రజల మూడ్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని గతంలో వచ్చిన ఓట్లు.. ఈసారి వివిధ కారణాలతో పెరగనున్న ఓట్లు.. లేకుంటే తగ్గనున్న ఓట్లు అంటూ లెక్కలు వేసి సర్వే ఫలితాలు వెల్లడిస్తాయి.సార్వత్రిక ఎన్నికల ఫీవర్ పతాక స్థాయికి చేరుకుంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు ప్రజానాడి పడుతున్నాయి. అందులో భాగంగా ఏపీలో మెజారిటీ లోక్సభ స్థానాలు ఏ పార్టీ దక్కించుకుంటుంది? దానినిబట్టి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? అన్నది సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి. ప్రస్తుతం కూటమి వెర్సెస్ వైసీపీ అన్న పరిస్థితి ఉంది. మధ్యలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఏపీలో గట్టి ఫైట్ నెలకొంది. ఈ తరుణంలో సర్వే సంస్థలు ఇస్తున్న ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయితాజాగా ఏబీపీ సీ ఓ టర్ సర్వే ఫలితాలను ప్రకటించింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ఏపీలో ఎన్డీఏ కూటమి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. వైసిపి ఐదు స్థానాలకి పరిమితం కానుందని సర్వేలో తేలింది. ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు, వైసీపీకి 40 శాతం ఓట్లు, కాంగ్రెస్కు రెండు శాతం ఓట్లు, ఇతరులకు 11 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అయితే ఈ ఒక్క సర్వే కాదు.. దాదాపు 10 సర్వే సంస్థలు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వమే వస్తుందని తేల్చి చెప్పాయి.ఇండియా టుడే సర్వేలో కూటమికి 17 సీట్లు, వైసీపీకి ఎనిమిది సీట్లు వస్తాయని తేలింది. సీఎన్ఎన్ న్యూస్ సర్వేలో కూటమికి 18 సీట్లు, వైసిపికి ఏడు సీట్లు, ఇండియా టీవీ సర్వేలో కూటమికి 17, వైసీపీకి ఎనిమిది సీట్లు దక్కుతాయని తేలింది. న్యూస్ ఎక్స్ సర్వేలో కూటమికి 18, వైసిపికి ఏడు, జన్మత్ పోల్స్ సర్వేలో కూటమికి 17 , వైసీపీకి 18, స్కూల్ ఆఫ్ పాలిటెక్ సర్వేలో కూటమికి 23, వైసీపీకి రెండు, పీపుల్స్ సర్వేలో కూటమికి 23, వైసిపికి రెండు, పయనీర్ పో ల్ సర్వేలో కూటమికి 18, వైసిపికి ఏడు, ఇండియా న్యూస్ సర్వేలో కూటమికి 18, వైసిపికి ఏడు, జీ న్యూస్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి ఎనిమిది లోక్సభ స్థానాలు దాక్కపోతున్నాయని తేలింది. అంటే దాదాపు 11 సర్వేలు కూటమిదే విజయం అని తేల్చి చెప్పడం విశేషం.