YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎస్ తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ

సీఎస్ తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ
అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయల కల్పనకు ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయాలని ఆ బ్యాంకు ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం ఆయనను కలిశారు. రాజధాని ప్రాంతం సీఆర్డీఏ పరిధిలో తమ బ్యాంకు ఆధ్వర్యంలో చేపట్టబోయే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన రుణంపై వారు సీఎస్ తో చర్చించారు. రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయల కల్పన ముఖ్యమని సీఎస్ తెలిపారు. దీనికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చి, మౌలిక సదుపాయల కల్పనకు రుణమివ్వడానికి అంగీకరించడం ఆనందకర విషయమన్నారు. సాధ్యమైనంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి రుణం మంజూరు చేయాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను సీఎస్ కోరారు. రాజధాని నిర్మాణంలో పనిచేస్తున్న కూలీలకు కల్పిస్తున్న సదుపాయాలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సంతృప్తి వ్యక్తంచేశారు. రాజదాని ప్రాంతంలోని వెంకయ్యపాలెం, కృష్ణయ్యపాలెం రాయపూడి గ్రామాల్లో భూముల్లేని నిరుపేదలతోనూ మాట్లాడినట్లు వారు తెలిపారు.  ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ, మౌలిక సదుపాయలు, పెట్టుబడుల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 

Related Posts