ప్రత్తిపాడు నియోజవర్గం
ఏలేశ్వరం మండలం టీడీపీ నాయకుడు పైల సుభాష్ చంద్రబోస్ స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహిచారు. కాకినాడ జిల్లా పార్లమెంటు అధికార ప్రతినిధిగా పైల సుభాష్ చంద్రబోస్ కొనసాగిన విషయం తెలిసిందే. నేడు ఆ పార్టీకి, పార్టీకి సంబంధించిన పదవులకు రాజీనామా చేసినట్లు మీడియా పూర్వకంగా ప్రకటించారు బోస్. పార్టీ పుట్టినప్పటి నుండి సేవ చేసినప్పటికీ ప్రస్తుత టిడిపి అభ్యర్థి తమను పక్కన పెట్టినట్లు అయన వెల్లడించారు. అవమానాలు భరిస్తూ వస్తున్నప్పటికీ నేటికీ అభ్యర్థిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని ప్రకటించారు.