YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

హాట్ హాట్ గా తెలుగు రాజకీయాలు

హాట్ హాట్ గా  తెలుగు రాజకీయాలు

విజయవాడ, ఏప్రిల్  18
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు మరో దశకు చేరుకున్నాయి. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రచారం పీక్‌లో ఉంది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్న వేళ రాజకీయం మరింత హాట్‌ హాట్‌గా మారుబోతంది.ఆంధ్రప్రదేశ్‌ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ జారీ కానుంది. ఇవాళ మంచి రోజు కావడంతో చాలా మంది అభ్యర్థులు గురువారం నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నామినేషన్లు స్వీకరణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధమైంది. వారితో బుధవారం ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వారం పాటు అంట్ 25వ తేదీ వరకు కొనసాగనుంది. 25వ తేదీ వరకు స్వీకరించిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. 26 వరకు వాటిని స్క్రూట్నీ చేస్తారు. ఇంతలో ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే ఏప్రిల్‌ 29 వరకు గడువు విధించారు. ఆలోపు నామినేషన్లు వెనక్కి తీసుకోవచ్చు. అనంతరం ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారుల ప్రకటిస్తారు. వారి మధ్య మే 13నపోలింగ్ నిర్వహించారు. జూన్‌ 4న ఫలితాలు ప్రకటిస్తారు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు పాతిక వేలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 10 వేల రూపాయల డిపాజిట్‌ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. లోక్‌సభ అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్‌లో, అసెంబ్లీ అభఅయర్థులు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో నామినేష పత్రాలు అధికారులకు అందిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు, హడావిడి లేకుండా అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. అన్నింటినీ అధికారులు రికార్డు చేయనున్నారు. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేయొచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థి ఫాం 2బీ, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి ఫాం2 ఏ సమర్పించాలి. ఇవి నామినేషన్ గడువు తీరేలోపు ఎప్పుడైనా సమర్పించవచ్చు. నామినేషన్ రోజే ఇవ్వాలే రూల్ లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా తమతోపాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందజేయాలి. దీన్ని ఫాం 26 స్టాంప్‌ పేపర్‌తో కలిపి ఇవ్వాలి. ఇది పది రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగి ఉండాలి. తప్పనిసరి పరిస్థితిలో ఈ స్టాంప్‌ పేపర్‌ కూడా వాడుకోవచ్చు. ఈ ఫాంలో ఆస్తులు, అప్పులతోపాటు కేసుల వివరాలు ప్రకటించాలి. ఇది నామినేషన్ వేసిన రోజే ఇవ్వాలనే రూల్‌ లేదు. నామినేషన్ స్వీకరణ గడువు ముగిసేలోపు ఎప్పుడైనా ఇవ్వొచ్చు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు ప్రతి అభ్యర్థికి బీఫాం ఇస్తాయి. తమ పార్టీ తరఫున ఆ వ్యక్తే అభ్యర్థిగా ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం ఇది. నామినేషన్ టైంలో ఆయా అభ్యర్థుల పార్టీ గుర్తును కూడా నామినేషన్లో పొందుపరచాలి. స్వతంత్ర అభ్యర్థులైతే ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నేరుగా నామినేషన్ ఇవ్వలేని పరిస్థితిలో అభ్యర్థులు సువిధ యాప్‌ ద్వారా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. అయితే వాటిని తర్వాత ఆర్వోకు స్వయంగా అభఅయర్థి వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గడువు లోపు జరగాలి. లేకుంటే ఆ నామినేషన్‌ను ప్రతిపాదనకు తీసుకోరు. నేరుగా నామినేషన్లు మాత్రం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే తీసుకుంటారు. సెలవు రోజుల్లో నామినేష్లను స్వీకరించరు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు ప్రపోజ్‌ చేయాలి. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి అయితే ఒక ఓటర్లు ప్రతిపాదిస్తే సరిపోతుంది. అలా ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. స్వతంత్రంగా పోటీ చేసే వాళ్లకు మాత్రం 10 మంది ఓటర్లు సంతకాలు చేయాలి. ఒక అభ్యర్థికి సపోర్ట్ చేసిన వ్యక్తి మరొక అభ్యర్థికి సపోర్ట్ చేయకూడదనే రూల్‌ ఏమీ లేదు. ఒక ఓటర్లు ఎంత మంది అభ్యర్థులకైనా ప్రపోజ్ చేయవచ్చు. నామినేషన్ పత్రాలు సమర్పించే సయమంలో కూడా రూల్స్ పాటించాలి. లేకుంటే కేసులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. నామినేషన్ దాఖలు చేసే ఆఫీస్‌కు అంటే... ఆర్వో ఆఫీస్‌కు 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేయాలి. ఆర్వో గదిలోకి కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతి ఇస్తారు. ఎన్నికల కోసం అభ్యర్థులు పెట్టే ఖర్చు నేటి నుంచి మొదలు కానుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దీన్ని లెక్కిస్తారు. దీని కోసం నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు అకౌంట్‌ తెరవాల్సి ఉంటుంది. దీని ఆధారంగా అధికారులు అభ్యర్థి ఖర్చును లెక్కిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షల  వరకు, ఎంపీ అభ్యర్థి 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకునే వీలుంది.

Related Posts